600 మందితో పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

600 మందితో పటిష్ట బందోబస్తు

Oct 23 2026 1:21 AM | Updated on Oct 23 2026 1:21 AM

● ఎస్పీ అజిత వేజెండ్ల

నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు 600 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ అజిత వేజెండ్ల గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, ఏఆర్‌ ఏఎస్పీ అప్పారావుతోపాటు ఏడుగురు డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, స్పెషల్‌ పార్టీలు, రిజర్వ్‌ పోలీసులు బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు. నామినేషన్‌ కేంద్రాల వద్ద చెక్‌పోస్టులు, సీసీ టీవీలు, డ్రోన్స్‌, మొబైల్‌ పెట్రోలింగ్‌తో నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఎన్నికల పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చన్నారు. ప్రతి అభ్యర్థికి అవసరమైన భద్రత కల్పించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement