వైఎస్సార్‌సీపీ నాయకులకు ఎస్సై బెదిరింపులు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకులకు ఎస్సై బెదిరింపులు

Oct 18 2026 12:18 AM | Updated on Oct 18 2026 12:18 AM

● నిబంధనలు అతిక్రమిస్తే

ఈసీకి ఫిర్యాదు చేస్తాం

● పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి

కోట: స్థానిక ఎస్సై పవన్‌కుమార్‌ అధికార పార్టీ నేతల కాళ్ల దగ్గర మోకరిల్లి.. వైఎస్సార్‌సీపీ నేతలను బెదిరిస్తున్నాడని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు పేర్నాటి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి అన్నారు. అతన్ని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్‌ చేశారు. అల్లంపాడులో పార్టీ ముఖ్య నేతలతో శనివారం ఆయన సమావేశం నిర్వహించారు. పలు పంచాయతీల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎస్సై తమను బెదిరిస్తున్నారని, చెప్పినట్లు వినకపోతే కేసుల్లో ఇరికిస్తామంటున్నారని పేర్నాటి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని గెలిచేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎస్సై ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎలక్షన్‌ కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. అతని అవినీతిపై ఎస్పీ సమగ్ర విచారణ జరపాలని కోరారు. కేసవరం పంచాయతీలో జరిగిన గ్రావెల్‌ అక్రమ తవ్వకాల్లో ఎస్సైకు వాటా ఉన్నట్లు ఆరోపణలున్నాయని, అధికార పార్టీ అండ ఉందనే ధీమాతో పోలీస్‌స్టేషన్‌లోనే సెటిల్‌మెంట్లు, దందాలు నిర్వహిస్తున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకునే కుట్రలు జరుగుతున్నాయని, దీనికి కోట ఎస్సై తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు పాదర్తి రాధాకృష్ణారెడ్డి, వెంకురెడ్డి, ప్రభాకర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement