అనధికార మద్యంపై ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

అనధికార మద్యంపై ప్రత్యేక నిఘా

Oct 18 2026 12:18 AM | Updated on Oct 18 2026 12:18 AM

● ఎకై ్సజ్‌ అధికారి

శ్రీనివాసులునాయుడు

నెల్లూరు(క్రైమ్‌): స్థానిక ఎన్నికల నేపథ్యంలో అనధికార మద్యం విక్రయాలు, అక్రమ నిల్వలు, సరఫరా, రవాణాను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి ఎ.శ్రీనివాసులు నాయుడు తెలిపారు. ఎన్నికల సందర్భంగా తీసుకుంటున్న చర్యలను శనివారం ఆయన వెల్లడించారు. మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. నెల్లూరు నగరంతో పాటు బుచ్చిరెడ్డిపాళెం, ఆత్మకూరు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఈఎస్‌టీఎఫ్‌, స్థానిక ఎకై ్సజ్‌ అధికారులు, సిబ్బందితో కూడిన ఆరు ప్రత్యేక బృందాలు ప్రతిరోజూ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు తనిఖీలు చేస్తున్నాయని చెప్పారు. మద్యం దుకాణాలు, బార్ల పనివేళల నిబంధనల అమలుతో పాటు విక్రయాలు, సరఫరాపై పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఒక్కొక్కరికి మూడు సీసాలకు మించి మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగరంలోని కరెంటాఫీస్‌ సెంటర్‌ వద్ద శనివారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వెంకట నరసరాజును అరెస్ట్‌ చేసి ఏడు క్వార్టర్‌ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నంత కాలం ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని, అక్రమ మద్యం కార్యకలాపాలపై సమాచారం ఉంటే టోల్‌ఫ్రీ నంబర్‌ 14405కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement