బుచ్చిరెడ్డిపాళెం: తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు మైనార్టీ మహిళా నాయకులు వైఎస్సార్సీపీలో చేరారు. పట్టణంలోని 11వ వార్డు ఖాజానగర్కు చెందిన షేక్ నూర్జహాన్తో పాటు షేక్.జరీనా, ఆసియా, హబీబ్, పర్వీన్, నౌషాద్, షాహీన, మస్తానమ్మ, రేష్మ తదితరులు టీడీపీని వీడి, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కోవూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి సమక్షంలో నెల్లూరులో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ప్రసన్న వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి షేక్ షకీలా బేగం, పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు షేక్ షాహుల్, డాక్టర్ అల్లాభక్షు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


