హామీల అమల్లో సర్కార్‌ విఫలం | - | Sakshi
Sakshi News home page

హామీల అమల్లో సర్కార్‌ విఫలం

Oct 18 2026 12:18 AM | Updated on Oct 18 2026 12:18 AM

● ధ్వజమెత్తిన మాజీ ఎంపీ ఆదాల

● మాజీ మంత్రి ప్రసన్నతో కలిసి జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రకటన

కోవూరు: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ ఘోరంగా విఫలమైందని, ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. కోవూరులోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఆదాల, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోవూరు, విడవలూరుకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను ప్రకటించారు. జెడ్పీటీసీ అభ్యర్థులుగా తోడేటి మహేష్‌, యాటగిరి శ్రుతి పేర్లను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆదాల మాట్లాడారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువవుతున్న తరుణంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు తమ పార్టీకి అనుకూలంగా మారనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకురాని అంశాన్ని ప్రస్తావించారు. తమ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, బరిలో దిగేందుకు ఎంతో మంది ముందుకొస్తున్నారని చెప్పారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో శ్రేణులు మమేకమై.. వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

పార్టీలో పలువురి చేరిక

గుమ్మళ్లదిబ్బ కాలనీ, పెద్దపాళేనికి చెందిన పలువురు.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి కండువాలను ఆదాల, ప్రసన్న కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరి చలపతిరావు, కొండూరు అనిల్‌బాబు, కొండ్రెడ్డి రంగారెడ్డి, చేజర్ల సుధాకర్‌రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మల్లు సుధాకర్‌రెడ్డి, శివుని నరసింహారెడ్డి, అనూప్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement