సీఎం ప్రోగ్రామ్‌లో బిజీగా ఉన్నాం.. తర్వాత చూస్తాం | - | Sakshi
Sakshi News home page

సీఎం ప్రోగ్రామ్‌లో బిజీగా ఉన్నాం.. తర్వాత చూస్తాం

Sep 26 2026 11:52 PM | Updated on Sep 26 2026 11:52 PM

● తెడ్డుపాడులో దొంగల హల్‌చల్‌

దుత్తలూరు(ఉదయగిరి): మండలంలోని తెడ్డుపాడు బీసీ కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్‌ చేశారు. దీనిపై గ్రామస్తులు ఎస్సై సుభాషిణికి సమాచారం తెలిపినా సీఎం కార్యక్రమంలో బిజీగా ఉన్నామని, తర్వాత చూస్తామని చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి వివరాల మేరకు.. కాలనీలో పోతులూరి వెంకటేశ్వర్లు ఇంట్లోకి గుర్తుతెలియని వ్యక్తులు చొరబడేందుకు ప్రయత్నించగా కుటుంబ సభ్యులు మేల్కొని కేకలు వేశారు. దీంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. అనంతరం హైస్కూల్లో చొరబడిన దుండగులు వంటసామగ్రిని అపహరించుకుని ఆటోలో పరారయ్యారు.

సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ

గోడలపై మద్యం టెండర్లు

● ఎకై ్సజ్‌ అధికారులపై ఆర్డీఓ ఆగ్రహం

చిల్లకూరు: మద్యం దుకాణాలకు సంబంధించిన టెండర్‌ నోటీసులను సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ ముఖద్వారం గోడలకు ఎక్సైజ్‌ అధికారులు అంటించారు. దీనిని ఆర్డీఓ అరుణకుమారి దృష్టికి శనివారం పలువురు విలేకరులు తీసుకెళ్లడంతో ఎకై ్సజ్‌ అధికారుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు కార్యాలయానికి వచ్చి అంటించిన నోటీసులను తొలగించారు.

చెరువు ఆక్రమణలపై తహసీల్దార్‌ పరిశీలన

అల్లూరు: మండలంలోని సింగపేట పరిధిలో రామన్నచెరువు కబ్జాపై సాక్షిలో ప్రచురించిన కథనంపై తహసీల్దార్‌ నవీన్‌కుమార్‌ శనివారం స్పందించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్రమణలపై వస్తున్న ఆరోపణలు గల ప్రాంతం తమ రెవెన్యూ పరిధిలోకి రాదని, అయినప్పటికీ మండల సర్వేయర్లతో సర్వే చేయిస్తామని, ఏమైనా ఆక్రమణలు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. త్వరలోనే సర్వే చేయించి తమ పరిధి వరకు బౌండరీలను గుర్తిస్తామన్నారు. ఆయన వెంట రెవెన్యూ అధికారులు ఉన్నారు.

కండలేరులో

17.25 టీఎంసీల నీరు

రాపూరు: కండలేరు జలాశయంలో శనివారం నాటికి 17.25 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయిగంగ కాలువకు 130, లోలెవల్‌ కాలువకు 10, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 10 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.

నిమ్మధరలు(కిలో)

పెద్దవి: రూ.150 సన్నవి: రూ.100

పండ్లు: రూ.50

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement