చిట్టమూరు: మల్లాం గ్రామంలోని వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్వేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి ఫలాభిషేకం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శత స్తంభ కల్యాణ మండపంలో విఘ్నేశ్వరుడు, వల్లీదేవసేన, సుబ్రహ్మణ్వేశ్వరస్వామి, చండికేశ్వరుడు, శివపార్వతులు తదితర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్టించారు. ముందుగా పాలు, నెయ్యి, పెరుగు, తేనెతో అభిషేకించారు. అనంతరం అరటి, బత్తాయి, యాపిల్, ద్రాక్ష తదితర ఫలాలతో అర్చకుడు భానుప్రకాష్‌శర్మ అభిషేకం గావించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లు చందనాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి నందిసేవ విశేషంగా జరిగింది.


