విజిలెన్స్‌ విచారణకు భయపడి.. | - | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌ విచారణకు భయపడి..

Sep 26 2026 11:52 PM | Updated on Sep 26 2026 11:52 PM

● హడావుడిగా కాలువ పనులు

● సాక్షి కథనంతో దిగొచ్చిన సర్కార్‌

చేజర్ల: సోమశిల దక్షిణ కాలువ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం సుమారు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ప్రాజెక్ట్‌ చైర్మన్‌ వేలూరు కేశవచౌదరి ఇతర కూటమి నాయకులు ఈ పనులను చేయకుండానే ఎంబుక్‌లలో రికార్డ్‌ చేసి నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలున్నాయి. నీటి పారుదల శాఖ కూడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిందని గత నెల ఆగస్టు 30వ తేదీన సాక్షి దినపత్రికలో ‘రూ.కోట్లు కేశవాయ స్వాహా’ అనే శీర్షికన కథనం ప్రచురించింది.

రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు

టీడీపీలోని ఓ వర్గం దీనిని సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు సర్కార్‌ దిగొచ్చి సోమశిల దక్షిణ కాలువ ఆధునికీకరణ పనులపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. ఆదివారం లేదా సోమవారం అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం వస్తున్నారని తెలిసింది. కాలువ పనులు చేయకుండానే నిధులు స్వాహా చేసిన విషయం ఎక్కడ బయటపడుతుందోనని హడావుడిగా ప్రాజెక్ట్‌ చైర్మన్‌ కేశవ చౌదరి తన స్వగ్రామం నాగుల వెల్లటూరు ప్రధాన రహదారి వెంబడి ఉన్న దక్షిణ కాలువ పనులను శనివారం రెండు జేసీబీల సాయంతో ౖపైపె మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. ఓ వైపు కాలువలో నీటి ప్రవాహం ఉన్నప్పటికీ కాలువ పనులు చేపట్టడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

మరికొన్ని బిల్లుల కోసం..

దక్షిణ కాలువ 6ఎల్‌ పనులకు రూ.9.80 లక్షలు, అదే పనికి రెండో విడతగా మరో రూ.9.80 లక్షలు.. అలాగే 3ఎల్‌ కాలువకు రూ.7.60 లక్షల పని పూర్తికాకుండానే బిల్లులు మూడు నెలల క్రితం ఎంబుక్‌లలో సహా పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసులో పెండింగ్‌లో ఉంది. పలు ఆరోపణల నేపథ్యంలో పనులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన ఉండటంతో హడావుడిగా పనులు చేపట్టడం కూటమి ప్రభుత్వ డొల్లతనానికి నిదర్శనం. నిధులు భోం చేసిన కాంట్రాక్టర్లందరూ మంత్రి ఆనం ప్రధాన అనుచరులేననే విమర్శలున్నాయి. ఆయనకు తెలిసే అవినీతి తంతు జరిగిందని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

సాక్షిలో ప్రచురితమైన కథనం

కాలువలో పారుతున్న నీటిలోనే చేపడుతున్న పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement