మద్యం, పొగతాగే వారు, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారికి రక్తనాళాలు క్రమేపి పూడుకుపోతుంటాయి. ఇలాంటి వారు ముందు జాగ్రత్తలుగా సంవత్సరానికి ఒక దఫా వాస్కులర్ సర్జన్‌ను సంప్రదించి పరీక్ష చేయించాలి. లక్షణాలు లేనివారికి ఎలాంటి స్కానింగ్‌లు అవసరం లేదు. నాడి పట్టుకుని పరిశీలించి రక్తనాళాల్లో రక్త ప్రసరణ సరిగా ఉందో లేదో చెప్పగలరు. ఇప్పటికే లక్షణాలతో బాధపడుతుంటే వాస్కులర్ సర్జన్ చేసే చికిత్స ద్వారా కాళ్లను కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. రక్తప్రసరణ సరిగా జరిగేందుకు వారానికి ఐదు రోజులు, రోజుకు అర్ధగంట వ్యాయామం చేయాలి. ధూమపానం ఆపేయాలి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. జంక్‌ఫుడ్స్‌ను దూరంగా పెట్టాలి.
– డాక్టర్ వై.సుదర్శన్‌రెడ్డి,
వాస్కులర్ అండ్ ఎండో వాస్కులర్
సర్జన్, నెల్లూరు


