మద్యానికి బానిసై భార్యకు వేధింపులు | - | Sakshi
Sakshi News home page

మద్యానికి బానిసై భార్యకు వేధింపులు

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

ఆత్మహత్య చేసుకున్న వివాహిత

తల్లిని కోల్పోయిన ఐదు నెలల చిన్నారి

మర్రిపాడు: ఆ చిన్నారికి లోకం ఇంకా తెలియదు.. అమ్మే తన ప్రపంచం. ఐదునెలల వయసులోనే తల్లిని కోల్పోవాల్సి వచ్చింది. భర్త వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడటంతో మండలంలోని డీసీపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన చాంద్‌ బాషాకు చీరాలకు చెందిన షేక్‌ హనీ (22)తో కొన్ని సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఐదునెలల బాబు ఉన్నాడు. హనీ తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. చాంద్‌ బాషా డీసీపల్లిలో దుకాణాన్ని అద్దెకు తీసుకుని పవర్‌ స్పేర్‌ పార్ట్స్‌ విక్రయిస్తున్నాడు. అదే ఊరిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతను మద్యానికి బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. హనీ భరించలేక సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. మంగళవారం ఉదయం ఇంటి యజమాని తలుపు కొట్టినా స్పందన లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి పరిశీలించి హనీ మృతిచెందినట్లు గుర్తించారు. ఆత్మకూరు సీఐ గంగాధర్‌, ఎస్సైలు జంపాని కుమార్‌, శ్రీనివాసులురెడ్డి, మర్రిపాడు ఏఎస్సై శ్రీనివాసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్య మృతి విషయం తెలియగానే చాంద్‌ బాషా పరారయ్యాడు. అతడిని నెల్లూరు రైల్వే స్టేషన్‌ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement