పొట్టకూటి కోసం వెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

పొట్టకూటి కోసం వెళ్లి..

Sep 4 2026 11:50 PM | Updated on Sep 4 2026 11:50 PM

లారీ, బైక్‌ ఢీ

నెల్లూరు జిల్లా వాసి దుర్మరణం

నెక్కొండ: పొట్టకూటి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్లిన ఓ వ్యక్తి బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదం వరంగల్‌ జిల్లా నెక్కొండ – వరంగల్‌ ప్రధాన రహదారిలో శుక్రవారం చోటుచేసుకుంది. ఏఎస్సై రవి కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం బసినేనిపల్లి గ్రామానికి చెందిన షేక్‌ మస్తాన్‌ (50) వరంగల్‌ జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లిలో తాపీమేస్త్రిగా పనిచేస్తున్నాడు. మస్తాన్‌ నెక్కొండ నుంచి బైక్‌పై వస్తుండగా మార్గమధ్యలోని క్రషర్‌ మిల్లు వద్ద లారీ అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో మస్తాన్‌ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఏఎస్సై తెలిపారు. కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య మస్తానమ్మ, ఇద్దరు కుమారులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement