తక్షణమే తగ్గించాలి | - | Sakshi
Sakshi News home page

తక్షణమే తగ్గించాలి

Aug 31 2026 12:02 AM | Updated on Aug 31 2026 12:02 AM

నెల్లూరు (పొగతోట): నానాటికీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ప్రజల పాలిట గుదిబండలా మారుతున్నాయి. జీతాలు పెరగకపోవడం.. నూతనంగా కొలువులు లభించకపోవడంతో సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఆదాయాలు పెరగకపోగా, ఖర్చులు మాత్రం ఎక్కువవుతున్నాయి. యుద్ధం సాకుతో రేట్లను పెంచి ప్రజలను దోచుకుంటున్నారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా..

నెల్లూరులో స్టోన్‌హౌస్‌పేట కేంద్రంగా నిత్యావసర సరుకులు జిల్లా వ్యాప్తంగా సరఫరా అవుతున్నాయి. ఇక్కడే దాదాపు వెయ్యికిపైగా హోల్‌సేల్‌, రిటైల్‌ దుకాణాలున్నాయి. కందిపప్పు కిలోను రూ.130 నుంచి రూ.140 వరకు.. మినపప్పు కిలో రూ.120 నుంచి రూ.130కు, వేరుశనగ పప్పు కిలో రూ.180కు.. చింతపండు కిలో రూ.240.. చక్కెర కిలోను రూ.80 నుంచి రూ.90కు విక్రయిస్తున్నారు. చక్కెర ధరలు రెండు నెలల్లో విపరీతంగా పెరగడంతో కేఫ్‌ల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. వీటి రేట్లను పెంచితే ప్రజలు రావడంలేదని పేర్కొంటున్నారు.

ప్రతి దానికీ యుద్ధమే

కారణమంట..!

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. నిత్యావసర సరుకుల రేట్లు.. ఇలా ప్రతి దానికీ యుద్ధాన్ని కారణంగా చూపుతున్నారు. రవాణా చార్జీలు పెరిగాయని, ఈ ప్రభావం దీనిపై పడిందనే సమాధానం యజమానుల నుంచి వస్తోంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతుల నుంచి రూ.పదికి కొనుగోలు చేసిన వస్తువు వినియోగదారుడికి చేరేసరికి రూ.45 నుంచి రూ.50 అవుతోంది. వచ్చిన ఆదాయాన్ని దళారులు, మధ్యవర్తులు, వ్యాపారులు స్వాహా చేస్తున్నారు. సరుకుల రేట్లు చూసి మహిళలకు కన్నీళ్లొస్తున్నాయి. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన ధరలతో ఏం కొనాలన్నా.. తినాలన్నా, భయమేస్తోంది. రోజువారి కూలిలతో బతికే పేదలు ఎలా బతకగలరు. నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అదుపు చేయాల్సిన ప్రభుత్వం మాటలతో కాలం గడుపుతోంది. ఇప్పటికై నా పాలకులు స్పందించి వీటిని నియంత్రించాలి. – రాసాల కుమారి,

బెడుసుపల్లి, సీతారామపురం మండలం

జిల్లాలో ఇలా..

మండుతున్న నిత్యావసర సరుకుల రేట్లు

యుద్ధం సాకు చూపి భారీగా పెంపు

మధ్య తరగతి అగచాట్లు

నియంత్రించడంలో సర్కార్‌ వైఫల్యం

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ప్రజలు

కూటమి పాలనలో పేద, మధ్య తరగతి వర్గాలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు రాకెట్‌ వేగంతో ౖపైపెకి దూసుకెళ్తుండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో వీరున్నారు. యుద్ధాన్ని సాకుగా చూపి రేట్లను పెంచి ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారు. సరుకుల కోసం రెండేళ్ల క్రితం వరకు ఓ చిన్న కుటుంబం నెలకు రూ.ఐదు వేల వరకు ఖర్చు చేసేది. అయితే ప్రస్తుతం ఇది రూ.ఎనిమిది వేలు దాటుతుండటంతో వారు ఆర్థిక భారాన్ని భరించాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా, నియంత్రించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ఈ తీరుపై ప్రజానీకం భగ్గుమంటోంది.

రెవెన్యూ డివిజన్లు – 4 మండలాలు – 36

జనాభా – 24.16 లక్షలు

కుటుంబాలు 6.29 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement