పారదర్శక పరిష్కారం.. | - | Sakshi
Sakshi News home page

పారదర్శక పరిష్కారం..

Aug 29 2026 12:11 AM | Updated on Aug 29 2026 12:11 AM

భూముల రీసర్వేలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పారదర్శకతను పాటించింది. దశాబ్దాలుగా భూముల సరిహద్దుల తకరారులను సరిదిద్దే చర్యలు చేపట్టింది. తొలుత ఎక్కడ సర్వే చేపడితే.. ఆ రెవెన్యూ గ్రామంలో సుమారు వందేళ్ల క్రితం ఏర్పాటు చేసిన సర్వే నంబర్ల వారీగా అక్షాంశాలు, రేఖాంశాలతో కచ్చితత్వంగా సరిహద్దు సర్వే రాళ్లను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత సదరు సర్వేనంబర్లలో ఏ రైతుకు ఎంత పొలం ఉందో, వారి వద్ద ఉన్న భూముల డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డుల ఆధారంగా హద్దురాళ్లు నాటి ప్రత్యేక నంబరుతో వారికి హక్కులు కల్పించింది. ఈ క్రమంలో ఎవరి భూమికి ఎలాంటి ఇబ్బందులు, తకరారులు లేకుండా చేసింది. అదే సమయంలో ఏళ్ల తరబడి ప్రభుత్వ శివాయి భూములు, ప్రభుత్వ పొరంబోకు, చెరువు పొరంబోకు భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను సరి చేసింది. ఈ క్రమంలో సదరు భూములకు సంబంధించి వారికున్న హక్కులకు సంబంధించి రికార్డులను పరిశీలించి.. తిరిగి రైతుల పేరిట హక్కులు కల్పించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement