చిట్టమూరు: మండల పరిధిలోని తాడిమేడు చెరువులో మట్టి తోలుకోవాలంటే అధికార పక్షానికి జై కొట్టాల్సిందే. లేకుంటే టీడీపీ నేతలు అధికారులు, పోలీసులను పంపి నిలుపుదల చేయిస్తారు. చెరువులో నుంచి మట్టిని తోలుకుని తమ పొలాలను చదును చేసుకోనునేందుకు కొద్దిరోజుల క్రితం వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులుగా ఉన్న రైతులు ప్రయత్నించారు. అయితే తమను కాదని ఎలా మట్టిని తోలుతారని టీడీపీ నేతలు పోలీసులను పంపి బెదిరింపులకు పాల్పడ్డారు. జేసీబీలు, ట్రాక్టర్లు తీసుకెళ్లిపోవాలని, లేకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతో చేసేది లేక రైతులు ఈ ప్రక్రియను ఆపేశారు. అయితే రెండు రోజుల నుంచి అధికార పార్టీకి సానుభూతిపరులు చెరువులో మూడు జేసీబీలు పెట్టి ట్రాక్టర్ల ద్వారా తమ పొలాలకు మట్టిని తరలిస్తున్నారు. దీనిపై పోలీసులు, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. కూటమి ప్రభుత్వంలో రైతులపై వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు చెరువులో ఇష్టానుసారంగా జేసీబీలు పెట్టి గుంతలు చేసి మట్టిని తోలేయడంతో సాగునీరు పొలాలకు పారే పరిస్థితి లేదని ఆయకట్టు రైతులు చెబుతున్నారు.
తాడిమేడు చెరువులో
మట్టి తరలింపుపై రైతుల ఆగ్రహం
పోలీసులు, ఇరిగేషన్
అధికారుల తీరుపై విమర్శలు


