● రెండు ట్రాక్టర్ల పట్టివేత
వాకాడు: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను వాకాడు పోలీసులు సోమవారం పట్టుకున్నారు. మంగళవారం పోలీసులు వివరాలు వెల్లడించారు. చిట్టమూరు మండలం రొయ్యల కాలువ ప్రాంతం నుంచి వాకాడుకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు పోలీసులకు సమచారం అందడంతో తనిఖీలు చేట్టారు. కేసు నమోదు చేసి రెండు ట్రాక్టర్లను వాకాడు తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్‌కు అప్పగించారు. అనంతరం తహసీల్దార్ జరిమానా విధించి ట్రాక్టర్ల యజమానులను మందలించినట్లు తెలిసింది.
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.125
సన్నవి : రూ.60
పండ్లు : రూ.30


