● నల్లబ్యాడ్జీలతో నిరసన
నెల్లూరు(అర్బన్): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం తమను రెగ్యులర్ చేయాలంటూ వైద్యశాఖకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగులు డిమాండ్ చేశారు. నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులకు హాజరయ్యారు. దశల వారీగా తాము ఆందోళనలు జరుపుతున్నామని ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెళ్తామంటూ కాంట్రాక్ట్ నర్సులు, ల్యాబ్‌టెక్నీషి యన్లు, ఇతర సిబ్బంది మంగళవారం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ మాధవికి నోటీసులు అందజేశారు. అలాగే తమ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ రెగ్యులర్ నర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వరలక్ష్మికి, బాలాజీ నగర్‌లో సీఐటీఐయూ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులుకు, ఎన్జీఓ భవన్‌లో ఆ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండారుపల్లి వెంకటేశ్వర్లుకు వినతిపత్రాలిచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులు తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు.
వినతిపత్రం అందజేత
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుని కాంట్రాక్ట్ వైద్యసిబ్బంది కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు అండగా నిలబడాలని కోరారు. కార్యక్రమాల్లో రూత్‌గ్రేస్, శేఖర్, సుసన్న తదితరులు పాల్గొన్నారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో..
● యువకుడి ఆత్మహత్య
వెంకటాచలం: ఫ్యాన్‌కు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెంకటాచలం పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మకాలనీలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. శివకుమార్ (23) ఇందిరమ్మ కాలనీలో తన కుటుంబ సభ్యులతో ఉంటూ పెయింట్ పనులకు వెళ్లేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొంతసేపటి తర్వాత కుటుంబ సభ్యులు గమనించి చుట్టుపక్కల వారి సాయంతో కిందకు దించారు. అయితే శివకుమార్ అప్పటికే చనిపోయి ఉన్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
విద్యుదాఘాతానికి
గురై వ్యక్తి మృతి
దగదర్తి: మండలంలోని దుండిగం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై కాప దామోదర్ (47) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోమవారం పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విద్యుత్, పోలీసు అధికారులు తెలిపారు. మంగళవారం వివరాలు వెల్లడించారు. దామోదర్ తన ద్విచక్ర వాహనాన్ని గ్రామంలోని రహదారి వద్ద ఉంచాడు. సమీప బీడు పొలాల్లో సుమారు ఎనిమిది అడుగుల ఎత్తులో వెళ్తున్న 11 కేవీ విద్యుత్ వైర్ల వద్దకు వెళ్లాడు. అనంతరం విద్యుత్ వైర్‌ను చేతితో తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు మంగళవారం మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కాగా.. దామోదర్ కుటుంబంలో కొంతకాలంగా కలహాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కావలి ఏరియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించినట్లుగా ఎస్సై మహేంద్ర తెలిపారు. దామోదర్‌కు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు నెల్లూరులో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


