బాలుడికి ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

బాలుడికి ఆర్థిక సాయం

Feb 25 2026 10:29 AM | Updated on Feb 25 2026 10:29 AM

బాలుడ

బాలుడికి ఆర్థిక సాయం

సోమశిల: అనంతసాగరం మండల పరిధిలోని పాతదేవరాయపల్లి గ్రామానికి చెందిన బాలుడు సంతోష్‌కు పలువురు ఆర్థిక సాయం చేశారు. గురవయ్య, సుభాషిణి కుమారుడైన 12 సంవత్సరాల సంతోష్‌ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సదరం సర్టిఫికెట్‌ ఉన్నా పెన్షన్‌ మంజూరుకాక, కనీసం మందులు కొనలేని స్థితిలో ఆ కుటుంబం ఉంది. దీంతో ఈనెల 19న సాక్షిలో ‘ఆదుకోండయ్యా..’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఆత్మకూరుకు చెందిన సమతా హెల్ప్‌ లైన్‌ టీమ్‌ సభ్యులు మంగళవారం గ్రామానికి చేరుకుని రూ.5,200లు సాయం చేశారు. వారు మాట్లాడుతూ బాలుడికి పింఛన్‌ మంజూరు చేస్తే ఆసరాగా ఉంటుందన్నారు. సాయం చేయాలని దాతల్ని కోరుతామన్నారు. కార్యక్రమంలో సభ్యులు మున్నా, మల్లికార్జున, శ్రీనివాసులు, అశోక్‌ పాల్గొన్నారు.

బాలుడికి ఆర్థిక సాయం
1
1/1

బాలుడికి ఆర్థిక సాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement