101 మెగావాట్ల సోలార్‌ విద్యుతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

101 మెగావాట్ల సోలార్‌ విద్యుతే లక్ష్యం

Feb 25 2026 7:08 AM | Updated on Feb 25 2026 7:08 AM

101 మ

101 మెగావాట్ల సోలార్‌ విద్యుతే లక్ష్యం

వింజమూరు(ఉదయగిరి): జిల్లాలోని 439 ఎక రాల ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో 101 మెగావాట్ల విద్యుత్‌ సామర్థ్యం గల సోలార్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నామని ఎస్పీడీసీఎల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ చక్రపాణి వెల్లడించారు. పీఎం కుసుమ్‌ పథకం ద్వారా జిల్లాలో ఏర్పాటు చేయనున్న సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించిన స్థలాలను మంగళవారం పరిశీలించారు. ఆత్మకూరు డివిజన్‌ పరిధిలోని వింజమూరు సెక్షన్లో గల కాటేపల్లి, తమిదపాడు, చాకలకొండలో ఎంపిక చేసిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆత్మకూరు డివిజన్‌ పరిఽధిలోని 96 ఎకరాల్లో 21 మెగావాట్ల సామర్థ్యం గల మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అనుమతులను కలెక్టర్‌ ద్వారా పొందామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సోలార్‌ ద్వారా విద్యుత్‌ను పగటి పూట అందించడమే లక్ష్యంగా వీటిని నిర్మిస్తున్నామని ప్రకటించారు. జిల్లా ఎస్‌ఈ రాఘవేంద్రం, ఆత్మకూరు ఈఈ భానూనాయక్‌, డీఈఈలు మునీంద్ర, కృష్ణమోహన్‌, ఏఈ నాగూర్‌వలీ తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఈఐఎల్‌

సీఈఓకు అవార్డు

ముత్తుకూరు(పొదలకూరు): మండలంలో ని నేలటూరులో గల ఎస్‌ఈఐఎల్‌ ఎనర్జీ ఇండియా సంస్థ సీఈ ఓ జన్మేజయ మహాపాత్రకు విశిష్ట గు ర్తుంపు లభించింది. న్యూఢిల్లీలో టైమ్స్‌ ఫౌండేషన్‌, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సీఎస్సార్‌ సమ్మిట్‌లో డిస్టింగ్విష్డ్‌ లీడర్‌షిప్‌ అవార్డును ఆయనకు అందజేశారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహా య మంత్రి అనుప్రియాపటేల్‌, భారతీయ సీఎస్సార్‌ రంగ ప్రముఖుడు భాస్కర్‌ ఛటర్జీ చేతుల మీదుగా అందుకున్నారు.

జనగణనను అప్రమత్తతతో

నిర్వహించాలి

నెల్లూరు (టౌన్‌): జనగణనను క్రమ పద్ధతిలో.. అప్రమత్తంగా నిర్వహించాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. నగరంలోని నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాలలో జిల్లా అధికారులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు మంగళవారం హాజరైన ఆయన మాట్లాడారు. జనగణన 2027ను రెండు విడతల్లో నిర్వహించనున్నారని.. తొలి దశలో హౌస్‌ లిస్టింగ్‌, హౌసింగ్‌ సెన్సస్‌.. రెండో దశలో జనగణన ఉంటుందన్నారు. జనగణనతో ప్రభు త్వ పథకాలు అందవనే అపోహ ప్రజల్లో ఉందని, అయితే ఇది కేవలం జనాభా సేకరణ కోసమేనన్నారు. దీని వల్ల కొత్త గ్రామాలు, మున్సిపాల్టీలు, ఏర్పడతాయని, అభివృద్ధికి బాటలు పడతాయని చెప్పారు. అన్ని రంగాల్లో జిల్లా ఐదో స్థానంలో, గణనలో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్‌, జనగణన సహాయ సంచాలకుడు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనానికి

18 గంటలు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ మంగళవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 77,803 మంది సోమవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 27,766 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లను సమర్పించారు. టైమ్‌ స్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.

101 మెగావాట్ల  సోలార్‌ విద్యుతే లక్ష్యం 
1
1/2

101 మెగావాట్ల సోలార్‌ విద్యుతే లక్ష్యం

101 మెగావాట్ల  సోలార్‌ విద్యుతే లక్ష్యం 
2
2/2

101 మెగావాట్ల సోలార్‌ విద్యుతే లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement