సంకల్పం ముందు ఓడిన వైకల్యం
● ఆ విద్యార్థికి అన్నీ తల్లే
● నడవలేని స్థితిలో ఇంటర్ పరీక్షకు
పొదలకూరు: ఆ విద్యార్థికి వైకల్యంతో పాటు సంగ్రహ శక్తీ తక్కువే. అయినా చదువంటే వల్లమాలిన ఇష్టం. ఈ ఆసక్తితో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 300 మార్కులతో పాసయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు తల్లి సాయంతో హాజరయ్యారు. అన్నీ తానై బిడ్డను తల్లి చూసుకుంటున్నారు. తన కుమారుడి పరీక్ష రాసేందుకు స్క్రైబ్‌ను తీసుకొచ్చారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద కుమారుడి కోసం తల్లి పడుతున్న తాపత్రయం మంగళవారం ఆసక్తిగా మారింది. పొదలకూరు సమీపంలోని చిట్టేపల్లికి చెందిన గాయత్రి.. శారీరక, మా నసిక వైకల్యంతో బాధపడుతున్న లక్ష్మీగణేష్‌ను ఆటోలో పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. తల్లి సంకల్పం ముందు బిడ్డ వైకల్యం ఓడిపోయింది. ఎంతో ఓపికతో విద్యార్థిని తీసుకొచ్చి లోపలికి పంపారు. ఇదంతా చూస్తున్న పలువురు తల్లిదండ్రులు ఆమెను అభినందించారు.


