
చందన, సీఎంఆర్‌లో మట్టి ప్రతిమల పంపిణీ
నెల్లూరు(బృందావనం): కనకమహల్ సెంటర్‌లోని చందన, సీఎంఆర్‌లో మంగళవారం మట్టి వినాయక ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. అధినేత మావూరి శ్రీనివాసరావు, డైరెక్టర్లు సంతోష్ రామమోహన్, వెంకటగణేష్‌లు మాట్లాడారు. చందన, సీఎంఆర్, కంచి కామాక్షి షోరూంలలో సుమారు 10 వేల ప్రతిమల పంపిణీ చేపట్టామన్నారు. సీఎంఆర్ షోరూం వద్ద 10 అడుగుల గణేష్ విగ్రహాన్ని రుద్రాక్షలతో తయారు చేయించినట్లు తెలిపారు. కాలుష్య రహిత వినాయక ప్రతిమలను తయారు చేసి వాటిని షోరూంలో ప్రదర్శనగా ఉంచి ఉత్తమంగా ఎన్నికై న వాటికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. పర్యవేక్షకులు మోపూరు పెంచలయ్య, శైలేష్, మేనేజర్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు.