
పండగ రోజు జేబులకు చిల్లు
● పెరిగిన పండ్లు, పూల ధరలు
నెల్లూరు(పొగతోట): పండగను అడ్డం పెట్టుకుని వ్యాపారులు పండ్లు, పూలు, కూరగాయల ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్నారు. సాధారణ రోజుల్లో రోజా, చామంతి పూలు కేజీ రూ.150 నుంచి రూ.200ల వరకు ఉంటాయి. వినాయకచవితి నేపథ్యంలో కేజీ రూ.600కు విక్రయిస్తున్నారు. పండగ వచ్చిందంటే ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న పూల మార్కెట్‌లో వ్యాపారులకు దోపిడీకి అడ్డు లేకుండా పోతోంది. అధికారులు సైతం పట్టించుకోకపోవడంతో వ్యాపారులు చెప్పిందే రేటుగా ఉంది. ఎవరైనా ప్రశ్నిస్తే పండగ సమయంలో పూల డిమాండ్ అధికంగా ఉంటుంది, అవి దొరకవు దూర ప్రాంతాల నుంచి తీసుకురావాలని వ్యాపారులు చెబుతున్నారు.
● సాధారణ రోజుల్లో ఆపిల్ కేజీ రూ.100 నుంచి రూ.150, దానిమ్మ కేజీ రూ.150 నుంచి రూ.200లు ఉంటుంది. పండగ సందర్భంగా ఆపిల్, దానిమ్మ కేజీ రూ.250 నుంచి రూ.300కు విక్రయిస్తున్నారు. అధిక ధరల్ని చూసి ప్రజలు అవాక్కవుతున్నారు.