
ముగిసిన రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీలు
● ప్రథమ స్థానంలో అనంతపురం జట్టు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో రెండు రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళా ఫుట్‌బాల్ పోటీలు ఆదివారం ముగిశాయి. ప్రథమ స్థానంలో అనంతపురం జట్టు, ద్వితీయ స్థానంలో వైఎస్సార్ కడప జిల్లా జట్టు, తృతీయ స్థానంలో నెల్లూరు జిల్లా జట్టు నిలిచాయి. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి రంజీ మాజీ క్రికెటర్, జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు మలిరెడ్డి కోటారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో రాణించాలంటే క్రమశిక్షణ ఎంతో ముఖ్యమన్నారు. సీనియర్ క్రీడాకారుడు, జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మలిరెడ్డి శ్రీనివాసులు నేతృత్వంలో సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారులు ఆనంద్, చిట్టి, చలపతి, ప్రభాకర్, అనిల్, శిరీష్, రవి విజేతలకు జ్ఞాపికలు, మెడల్స్, సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి పి.చంద్రశేఖర్, కోచ్‌లు పాండు, సాయి పాల్గొన్నారు.