ట్రూఅప్‌ చార్జీలు, ఇంధన సర్దుబాటు పేరుతో కూటమి దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ట్రూఅప్‌ చార్జీలు, ఇంధన సర్దుబాటు పేరుతో కూటమి దోపిడీ

Aug 25 2025 8:53 AM | Updated on Aug 25 2025 8:53 AM

 ట్రూ

ట్రూఅప్‌ చార్జీలు, ఇంధన సర్దుబాటు పేరుతో కూటమి దోపిడీ

కూటమి ప్రభుత్వం ట్రూఅప్‌, ఇంధన సర్దుబాటు పేరుతో చార్జీల మోత మోగిస్తోంది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని, అవసరమైతే చార్జీల భారాన్ని తగ్గిస్తామంటూ కోతలు కోసిన చంద్రబాబు తన అసలు రూపాన్ని బయట పెట్టుకున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చార్జీలు పెంచలేదని, ఆ భారాన్ని ఇప్పుడు వేయకతప్పడం లేదని చెబుతున్న కూటమి ప్రభుత్వం గృహ వినియోగదారులపై ఎడాపెడా బిల్లులతో బాదేస్తోంది.
నెలకు రూ.50 కోట్లపై మాటే భారం

నెల్లూరు (వీఆర్సీసెంటర్‌): ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న’ అన్నట్టు చంద్రబాబు తీరు ఉంది. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెంచబోమని, విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని హామీలు గుప్పించిన చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ చార్జీల బాదుడు మొదలు పెట్టాడు. దీంతో ప్రజలకు విద్యుత్‌ బిల్లులను చూస్తేనే షాక్‌ కొడుతున్నాయి. గతంలో వైఎస్సార్‌సీపీ విద్యుత్‌ చార్జీలు పెంచలేదని దీంతో ఇంధన సర్దుబాటు చార్జీలు, ట్రూఅప్‌ చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలు అమాంతంగా పెంచేసింది. 2022, 2023, 2024 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలు వాడుకున్న విద్యుత్‌కు బిల్లులు చెల్లించారు. అయితే అప్పుడు వాడుకుని బిల్లులు సైతం కట్టిన వాటికి ప్రస్తుతం ఇంధన సర్దుబాటు చార్జీలు, ట్రూ అప్‌ చార్జీలు కట్టాలని విద్యుత్‌ బిల్లుల్లో అదనంగా వేస్తున్నారు. దీంతో ప్రతి కరెంట్‌ బిల్లు చేతికి వస్తుందంటే సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా 2025 సంవత్సరానికి కూడా ఇందన సర్దుబాటు, ట్రూఅప్‌ చార్జీలు వేస్తుండడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు విద్యుత్‌ బిల్లులు చెల్లించటం పెను భారంగా మారుతోందని పలువురు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

కరెంట్‌ బిల్లుల పాపం చంద్రబాబుదే

వాస్తవానికి కరెంట్‌ బిల్లులు పెరగడానికి చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్య తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలు, అనవసరంగా అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేశారు. దీనికి తోడు విద్యుత్‌ డిస్కంలకు రూ.వేల కోట్ల బకాయిలు పాపాల వల్లే గతం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రజలపై అధిక భారం పడకుండా ట్రూఅప్‌, ఇందన సర్దుబాటు పేరు అరకొరగా పెంచింది. అయితే అప్పటి ప్రతిపక్షంలోని చంద్రబాబు అండ్‌ కో, పచ్చమీడియా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశాయి. తిరిగి ప్రజలపై బిల్లుల భారం పడకుండా అప్పట్లోనే అన్ని సర్దుబాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇష్టారీతిన విద్యుత్‌ చార్జీలు పెంచుతూ వచ్చింది. దీనికి తోడు అవసరం లేకపోయినా, డిమాండ్‌ లేకపోయినా అత్యధిక ధరలకు ప్రైవేట్‌ విద్యుత్‌ ఉత్పత్తిదారుల నుంచి కొనుగోళ్లు చేసింది. తాజాగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022, 2023, 2024 సంవత్సరాల్లో వాడుకున్న కరెంట్‌కు ట్రూఅప్‌, ఇందన సర్దుబాటు పేరుతో రూ.వేల కోట్ల బాదుడు బాదేస్తోంది. విద్యుత్‌ చార్జీలు పెరగడానికి చంద్రబాబు చేసిన పాపాలే.. విద్యుత్‌ వినియోగదారులకు శాపాలుగా మారాయి.

యూనిట్లు సర్‌ చార్జీలు కస్టమర్‌ మొత్తం

చార్జీలు

0–30 రూ.10 రూ.25 రూ.92

31–75 రూ.10 రూ.30 రూ.340

76–125 రూ.10 రూ.45 రూ.617

126–225 రూ.10 రూ.50 రూ.1,410

226–400 రూ.10 రూ.65 రూ.3,575

401–500 రూ.10 రూ.65 రూ.4,950

501–600 రూ.10 రూ.65 రూ.5,925

30 యూనిట్లలోపు వినియోగంపై రూ.100

600 యూనిట్లలోపు వాడకంపై రూ.1,000

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెంచని విద్యుత్‌ చార్జీలు

ఆ ప్రభుత్వం పెంచలేదని

కూటమి పెంచేసిన వైనం

జిల్లా ప్రజలపై నెలకు రూ.50 కోట్లపైగా అదనపు భారం

యూనిట్‌ సర్‌చార్జీలు కస్టమర్‌ సర్దుబాటు

చార్జీలు చార్జీలు

0–30 రూ.10 రూ.25 రూ.192 పైగా

31–75 రూ.10 రూ.30 రూ.440 పైగా

76–125 రూ.10 రూ.45 రూ.850 పైగా

126–225 రూ.10 రూ.50 రూ.1,800 పైగా

226–400 రూ. 10 రూ.65 రూ.4,200 పైగా

401–500 రూ.10 రూ.65 రూ.5,800 పైగా

501–600 రూ.10 రూ.65 రూ.6,800 పైగా

జిల్లాలోని ప్రతి వినియోగదారుడికి విద్యుత్‌ బిల్లులతోపాటు వాడకాన్ని బట్టి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి ప్రభుత్వంలో అదనంగా రూ.100 నుంచి రూ.1,000 అదనంగా ఇంధన సర్దుబాటు, ట్రూఅప్‌ చార్జీల రూపంలో వసూలు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మినిమం 30 యూనిట్లలోపు వినియోగంలోపు వాడకానికి అన్ని చార్జీలు కలుపుకుని రూ.92 ఉంటే.. కూటమి ప్రభుత్వంలో రూ.192లకుపైగా బిల్లు వస్తోంది. అదే 600 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని చార్జీలు కలుపుకుని రూ.5,925 వస్తే.. కూటమి ప్రభుత్వంలో రూ.6,800 పైగా బిల్లు వస్తోంది. జిల్లాలో మొత్తం గృహవిద్యుత్‌ కనెక్షన్లు 9,63,379 ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి నెలా ట్రూఅప్‌ చార్జీలు, ఇందన సర్దుబాటు చార్జీల రూపంలో దాదాపుగా రూ.50 కోట్ల వరకు అదనపు చార్జీల రూపంలో ప్రజలపై అదనపు భారం వేసి వసూలు చేస్తున్నారు.

 ట్రూఅప్‌ చార్జీలు, ఇంధన సర్దుబాటు పేరుతో కూటమి దోపిడీ 1
1/1

ట్రూఅప్‌ చార్జీలు, ఇంధన సర్దుబాటు పేరుతో కూటమి దోపిడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement