
విచారణాధికారి ఎదుట కాకాణి హాజరు
నెల్లూరు (క్రైమ్): మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆదివారం పొదలకూరు మైనింగ్ కేసులో విచారణాధికారి నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఎదుట హాజరయ్యారు. పొదలకూరు పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా విచారణాధికారి ఎదుట హాజరు కావాలని కాకాణికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు కాకాణి డీఎస్పీ ఎదుట హాజరయ్యారు. కేసులు కోర్టు పరిధిలో ఉన్న దృష్ట్యా వాటి గురించి తానేమి మాట్లాడలేనని విలేకరులు అడిగిన ప్రశ్నకు కాకాణి సమాధానమిచ్చారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.