
ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మూడు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి అండర్–15 బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. విజేతలకు బహుమతి ప్రదానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు ముక్కాల ద్వారకనాథ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రతి రాష్ట్రస్థాయి పోటీలో క్రీడాకారులకు ప్రతిభను పెంచుకునేందుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు. జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులకు సైతం రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. అనంతరం విజేతలకు జ్ఞాపికలను, మెడల్స్‌ను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చౌదరి జ్యూవెలర్స్ ఎండీ రాకేష్ చౌదరి, నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మద్దిపాటి ప్రసాద్‌రావు, ట్రెజరర్ గాదంశెట్టి శ్రీకాంత్, రాష్ట్ర వ్యాప్తంగా అసోసియేషన్ ప్రతినిధులు, అంపైర్లు పాల్గొన్నారు.
విజేతలు
దర్గామిట్ట ఎస్‌ఐకు
సీఐగా పదోన్నతి
నెల్లూరు (క్రైమ్): గుంటూరు రేంజ్ పరిధిలో ఆరుగురు ఎస్‌ఐలకు సీఐలుగా పదోన్నతి కల్పి స్తూ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో నెల్లూరు దర్గామిట్ట ఎస్‌ఐ బి. రమేష్‌బాబు ఉన్నారు.
నేత్రపర్వం.. తెప్పోత్సవం
వెంకటాచలం: భగవాన్ శ్రీవెంకయ్యస్వామి 43వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి తెప్పోత్సవం నేత్రపర్వంగా సాగింది. తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు వేలా ది సంఖ్యలో భక్తులు కోనేటి కట్టపై చేరడంతో పోలీసులు నలువైపులా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. భక్తులు కట్టపై నుంచి కిందకు దిగకుండా కట్టడి చేశారు. తెప్పోత్సవంతో ఆరాధన మహోత్సవాలు ముగిశాయి.

ముగిసిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలు