
వలంటీర్లకు నియామక పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి
● ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
కొడవలూరు: ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఓ మోసకారి అని, ప్రజలను నమ్మించి మోసం చేయడం ఆయనకు అలవాటేనని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని దామేగుంటలో గురువారం నిర్వహించిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల మ్యానిఫెస్టోలో నవరత్నాలు మాత్రమే చెప్పి 33 పథకాలను అమలు చేశారని తెలిపారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగిలినప్పుడు ప్రజలంతా ఒక్కటేనని నమ్మిన ఏకై క ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. కుల, మత, వర్గాలు, పార్టీ పట్ల పక్షపాతం చూపకుండా సంక్షేమ పథకాలందించిన గొప్ప ముఖ్యమంత్రి అని అభివర్ణించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జగన్ రూపొందించిన అద్భుత సృష్టి అన్నారు. ఎమ్మెల్యేలు ప్రతి గడపకు వెళ్లి ఏం కావాలో అడగడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ పథకాలందాలంటే జన్మభూమి కమిటీల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉండేదని, వారు లంచాలు వసూలు చేయనిదే ఏ ఒక్క పథకం ఇచ్చేవారు కాదన్నారు. ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పి ఆ తరువాత హైదరాబాద్‌లో తిష్ట వేయడం టీడీపీ నేతలకు అలవాటేనన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో గడిచిన నాలుగున్నరేళ్లుగా నేతలు, అధికారులు ప్రజల్లోనే ఉన్నారని గురుచేశారు. ప్రజలు ఇబ్బంది పడకూడదని పరితపించే ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అందువల్లే సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజల వద్దకే పాలన తెచ్చారన్నారు. రాష్ట్రానికి ప్రజల కష్టసుఖాలను పంచుకునే ముఖ్యమంత్రి కావాలా లేక ఎన్నికల సమయంలో డబ్బుతో వచ్చే ముఖ్యమంత్రులు కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు. మరో నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండడంతో బాబు,, పవన్ ప్రజలపై ఎక్కడ లేని ప్రేమ ఒలకపోస్తూ వస్తున్నారన్నారు. అలాంటి వారిని నమ్మితే ప్రజలే నష్టపోతారన్నారు. మనకి ఎవ్వరు మంచి చేశారో గుండెలపై చేయి వేసుకుని ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం సచివాలయంలో గ్రామానికి అందిన రూ.12.44 కోట్ల సంక్షేమ పథకాల వివరాలతో కూడిన బోర్డును ఆవిష్కరించారు. 11మంది వలంటీర్లకు నియా మక పత్రాలను అందజేశారు. డీసీఎమ్మెస్ చైర్మన్ వీరి చలపతిరావు, జెడ్పీటీసీ పసుపులేటి సరోజనమ్మ, ఎంపీపీ గాలి జ్యోతి, సర్పంచ్ చిమటా హరిత, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ గంధం వెంకటశేషయ్య, సచివాలయాల మండల కన్వీనర్ కొండా శ్రీనివాసులురెడ్డి,నాయకులు చిమటా శేషగిరి,మల్లికార్జున, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, పంచాయతీ కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు.