Yuvi New Look With Long Hair Pic Posted on His Instagram Account, Looks Cool - Sakshi
Sakshi News home page

Yuvraj Singh: న్యూలుక్‌లో అదరగొడుతున్న యువీ

Mar 26 2021 6:45 PM | Updated on Mar 26 2021 8:00 PM

Yuvraj Singh New Look Photos Posted In Instagram Gone Viral - Sakshi

సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్.. తన తాజా లుక్‌తో మరోసారి అభిమానులను అలరించాడు.

న్యూఢిల్లీ: ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ.. ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచే సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్.. తన తాజా లుక్‌తో మరోసారి అభిమానులను అలరించాడు. యువీ తన న్యూలుక్‌కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్‌ వస్తుంది. సరికొత్త లుక్‌లో యువీ పొడవాటి జుట్టుతో పాటు గడ్డంతో కనిపిస్తాడు. ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ట్రెండ్‌ అవుతున్నాయి. దీంతో అభిమానులు భారీ ఎత్తున లైక్‌లు కొడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యువీ తాజా పోస్ట్ పై టీమిండియా ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. " భాయ్ బాద్ షా లా మారిపోయావ్ " అంటూ ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా తదితరులు కామెంట్ చేశారు.

 

కాగా, తాజాగా ముగిసిన రోడ్ సేఫ్టీ ప్రపంచ సిరీస్ 2021 లో యువీ.. తన పూర్వపు ఫామ్‌ను కనబరుస్తూ ఇండియా లెజెండ్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ సిరీస్‌లో యువీ.. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 170.17 స్ట్రయిక్‌ రేట్‌తో 194 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో యువీ మొత్తం 17 సిక్సర్లు బాదాడు. టోర్నీ మొత్తంలో యువీనే అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలవడం విశేషం. వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన వరుసగా నాలుగు సిక్సర్లు బాది.. తన పాత రికార్డును( వరుసగా 6 సిక్సర్లు) మరోసారి సాధించేలా కనిపించాడు. ఫైనల్ మ్యాచ్‌లో సైతం యువీ రెచ్చిపోయి ఆడాడు. శ్రీలంక లెజెండ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 60 పరుగులు సాధించి, భారత లెజెండ్స్‌ను చాంపియన్‌గా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు.

Advertisement
 
Advertisement
Advertisement