యువరాజ్‌సింగ్‌ గాయపడిన బాహుబలి..!

Yuvraj Singh Grand Reception After India Legends Win Title - Sakshi

రాయ్‌పూర్‌: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ 2021 ఫైనల్‌లో ఇండియా లెజెండ్స్ ఆదివారం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇండియా లెజెండ్స్ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్  ఫైనల్‌ మ్యాచ్‌ గెలవడంలో  యువరాజ్ సింగ్  పాత్ర ఎంతగానో ఉంది.ఫైనల్లో యువరాజ్ సింగ్  41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఇండియా టీం ప్లేయర్లకు  హోటల్‌ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. యువరాజ్ సింగ్‌ భారత ఆటగాళ్లకు జరిగిన స్వాగత  వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇక్కడ చదవండి: ఇండియాదే లెజెండ్స్ ‌కప్‌

వీడియోలో యువీ హోటల్‌లోకి డ్యాన్స్ చేస్తూ వచ్చాడు , సిబ్బంది అతనికి గౌరవ సూచకంగా బాహుబలి సినిమాలో ప్రభాస్‌ ఎంట్రీ మాదిరిగా,  లాంగ్ హ్యాండిల్ ప్యాన్‌లను కత్తులలాగా  పైకిలేపారు. ఈ వీడియోకు  బ్లాక్ గ్రౌండ్‌లో సాహోరే బాహుబలి పాటను వేశారు. ఫైనల్‌ మ్యాచ్‌లో యువీ కుడికాలికి కాస్త గాయమైంది. దీంతో యువీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో "బ్రోకెన్ బాహుబలి," అంటూ వీడియోకు క్యాప్షన్‌ ఇస్తూ షేర్‌ చేశాడు. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్  సీజన్‌లో  అత్యధిక సిక్సర్‌లను బాదిన బ్యాట్స్‌మన్‌గా యువరాజ్ సింగ్ నిలిచాడు. ఏడు మ్యాచ్‌లలో 17 సిక్స్‌లను కొట్టాడు.

(చదవండి: యువీ దూకుడు.. యూసఫ్‌ మెరుపులు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top