Sakshi News home page

Yash Dhull: చరిత్ర సృష్టించిన యష్‌ ధుల్‌... 8 ఏళ్లలో ఒకే ఒక్కడు!

Published Sun, Feb 20 2022 3:20 PM

Yash Dhull Becomes Only 3rd Batter In Ranji Trophy History To Achieve Incredible Feat - Sakshi

అండర్‌- 19 ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు ప్రపంచకప్‌ సాధించి పెట్టిన కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. అరంగేట్ర మ్యాచ్‌లో యష్‌ సెంచరీల మోత మోగించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ, తమిళనాడు జట్లు మొదటి మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన యశ్‌ ధుల్‌..రెండో ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీతో మెరిశాడు. ఈ నేపథ్యంలో యశ్‌ ధుల్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు.

రంజీ ట్రోఫీ అరంగేట్ర మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోను సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా యష్‌ధుల్‌ నిలిచాడు. అంతకు ముందు గుజరాత్‌ బ్యాటర్‌ నారీ కాంట్రాక్టర్ ఈ ఫీట్ సాధించిన మొదటి వ్యక్తి కాగా, మహారాష్ట్ర బ్యాటర్‌ విరాగ్ అవతే రెండో ఆటగాడిగా ఉన్నాడు. 1952-53 రంజీట్రోఫీ సీజన్‌లో కాంట్రాక్టర్ ఈ ఘనత సాధించగా, 2012-13 సీజన్‌లో విరాగ్ అవతే ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 113 పరుగులు చేసిన యష్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 113 పరగులు సాధించాడు.  కాగా ఐపీఎల్‌ మెగా వేలం-2022లో భాగంగా ఢిల్లీ ఫ్రాంఛైజీ 50 లక్షల రూపాయలు వెచ్చించి యశ్‌ ధుల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: Rashid Khan: గార్డ్ ఆఫ్ హానర్‌ స్వీకరించిన రషీద్‌ ఖాన్‌.. ఎందుకో తెలుసా?

Advertisement
Advertisement