WTC Final NZ vs India: Fans Flood Twitter With Memes As Rain Delays Start Of WTC Final 2021 In Southampton - Sakshi
Sakshi News home page

WTC Final: కేదార్‌ చెప్పినట్లు మీలో ఎవరైనా చెప్పండి బ్రో!

Jun 18 2021 4:46 PM | Updated on Jun 18 2021 6:36 PM

WTC Final: Match Delayed Social Media Flooded With Memes Funny Videos - Sakshi

ఇదిగో ఇప్పుడు క్రికెట్‌ ఆడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది!

సౌతాంప్టన్‌: ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వరుణుడు ఆటంకం కలిగించడంతో క్రికెట్‌ ప్రేమికులు నిరాశకు గురయ్యారు. ‘‘వరుణుడా కాస్త కరుణించు.. మా ఫేవరెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వీలు కలిగించు’’ అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే, కొంతమంది ఔత్సాహిక నెటిజన్లు మాత్రం తమ సృజనాత్మకతకు పదునుపెడుతూ ఫన్నీ మీమ్స్‌, ఫొటోలతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ‘‘వరల్డ్‌ కప్-2019 సమయంలో కేదార్‌ యాదవ్‌ చెప్పినట్లుగా ఇప్పుడు కూడా ఎవరైనా ఒక టీమిండియా ప్లేయర్‌.. వర్షాన్ని వెళ్లిపొమ్మని చెప్పవచ్చుగా బ్రో’’ అంటూ ఓ ట్విటర్‌ యూజర్‌ పాత వీడియోను పంచుకున్నారు.

మరొకరేమో.. ‘‘టీమిండియా కాదు.. న్యూజిలాండ్‌ కాదు.. వర్షం టాస్‌ గెలిచింది. ఇరుజట్లపైన పైచేయి సాధించింది. ఇప్పుడు రెండు జట్ల ఫ్యాన్స్‌ ఏం చేస్తున్నారో తెలుసా’’ అంటూ ఇద్దరు పిల్లలు బిక్క ముఖాలు వేసుకుని కన్నీరు కారుస్తున్న ఫొటోను షేర్‌ చేశారు. ఇంకొంత మందేమో.. ‘‘ఇదిగో ఇప్పుడు క్రికెట్‌ ఆడితే పరిస్థితి ఇలాగే ఉంటుంది’’ అని గల్లీ క్రికెట్‌ ఆడుతూ ఓ వ్యక్తి జారిపోయిన దృశ్యాలు షేర్‌ చేసి ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాటిపై ఓ లుక్కేయండి మరి. కాగా వర్షం కారణంగా భారత్‌, న్యూజిలాండ్ జట్ల మ‌ధ్య మధ్యాహ్నం 3 గంటల(భారత కాలమానం ప్రకారం)కు ప్రారంభంకావాల్సిన మ్యాచ్‌ తొలి సెషన్‌ రద్దు చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి: WTC Final: వ‌ర్షం కారణంగా తొలి సెష‌న్ ర‌ద్దు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement