రెజ్లర్‌ హత్యకేసు: సుశీల్‌ కస్టడీ పొడిగింపు  | Wrestler Susheel Kumar Custody Extended To June 25th | Sakshi
Sakshi News home page

రెజ్లర్‌ హత్యకేసు: సుశీల్‌ కస్టడీ పొడిగింపు 

Jun 12 2021 10:07 AM | Updated on Jun 12 2021 10:09 AM

Wrestler Susheel Kumar Custody Extended To June 25th - Sakshi

న్యూఢిల్లీ: యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న భారత మేటి రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ జ్యుడీషియల్‌ కస్టడీ కొనసాగనుంది. అతని కస్టడీని జూన్‌ 25 వరకు పొడిగిస్తున్నట్లు ఢిల్లీ మెట్రోపాలిటన్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ రితికా జైన్‌ ఆదేశించారు. తొమ్మిది రోజుల కస్టడీ ముగిసిన తర్వాత పోలీసులు సుశీల్‌ను శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా అతనికి ఎలాంటి ఊరట లభించలేదు. రెజ్లర్‌ హత్యకు సంబంధించి పోలీసులు సుశీల్‌ సహా మొత్తం పది మందిని ఇప్పటి వరకు అరెస్ట్‌ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement