Boxing World C’ships: ఫైనల్లో నీతూ, నిఖత్‌.. భారత్‌కు కనీసం 2 సిల్వర్‌ మెడల్స్‌ ఖాయం

Womens World Boxing Championships: Nikhat Zareen, Nitu Ghanghas Enter Final - Sakshi

మహిళల బాక్సింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్స్‌-2023లో భారత్‌కు కనీసం రెండు రజత పతకాలు ఖాయమయ్యాయి. ఇవాళ (మార్చి 23) జరిగిన సెమీ ఫైనల్లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ బాక్సర్ నీతూ ఘంగాస్ (48 కేజీలు), ప్రస్తుత వరల్డ్‌ ఛాంపియన్ నిఖత్ జరీన్ (50 కేజీలు) ప్రత్యర్ధులపై విజయాలు సాధించి ఫైనల్‌కు చేరారు. నీతూ.. కజకిస్తాన్‌కు చెందిన అలువా బాల్కిబెకోవాపై విజయం సాధించగా, తెలంగాణ అమ్మాయి నిఖత్‌.. కొలంబియా బాక్సర్‌ ఇంగ్రిడ్‌ వెలెన్సియాను మట్టికరిపించింది.

ఈ పోటీల్లో భారత్‌కు మరో 2 పతకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. నిన్న జరిగిన క్వార్టర్స్‌లో లోవ్లినా బోర్గోహైన్ (75 కేజీలు), సావీటీ బూరా (81 కేజీలు) విజయాలు సాధించి కనీసం కాంస్యం పతాకన్ని ఖరారు చేశారు. ఇవాళ రాత్రి 8:15 గంటలకు జరిగే సెమీఫైనల్లో లవ్లీనా.. లీ కియాన్‌ (చైనా)ను, రాత్రి 8: 30 గంటల​కు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో సావీటీ.. సూ ఎమ్మా గ్రీన్‌ట్రీ (ఆస్ట్రేలియా)తో తలపడనున్నారు. ఈ బౌట్‌లలో వీరిరువురు విజయాలు సాధిస్తే, భారత్‌కు మరో 2 రజత పతకాలు ఖాయమవుతాయి. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top