#CSKVsGT: డాట్‌ బాల్‌ స్థానంలో చెట్టు గుర్తు?.. బీసీసీఐ మాస్టర్‌ ప్లాన్‌

Why Dot Ball Replaced-By-Tree-Sign-GT Vs CSK Qualifier-1-IPL 2023 - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా సీఎస్‌కే, గుజరాత్‌ టైటాన్స్‌ క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌ను స్టార్‌స్టోర్ట్స్‌లో ప్రసారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్‌లో  ఒక్కో డాట్‌ బాల్‌ను సదరు బ్రాడ్‌కాస్ట్‌ సంస్థ స్కోరుబోర్డులో ఒక్కో చెట్టు గుర్తును చూపించింది. అదేంటి డాట్‌ బాల్‌ అనగానే స్కోరు బోర్డును సున్నా కనిపించాలి గాని ఇలా చెట్టు కనిపించడం ఏంటని అభిమానులు ఆశ్చర్యపోయారు. అయితే దీని వెనుక బీసీసీఐ చేసిన ఒక గొప్ప ఆలోచన బయటకొచ్చింది.

అదేంటంటే.. Green Initiative(పర్యావరణం పెంపొందించడానికి) పేరిట బీసీసీఐ ఒక వినూత్న కార్యం చేపట్టింది. ఐపీఎల్‌ 2023లో ప్లేఆఫ్స్‌లో అన్ని డాట్‌ బాల్స్‌ను కలిపి 500 మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. బీసీసీఐ ఆలోచనను అభినందించిన స్టార్‌స్టోర్ట్స్‌ యాజమాన్యం గుజరాత్‌, సీఎస్‌కే ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో నమోదైన డాట్‌ బాల్స్‌ స్థానంలో చెట్టు గుర్తును ఉంచేలా ప్రణాళిక రూపొందించింది.ఇది చూసిన క్రికెట్‌ ఫ్యాన్స్‌ పర్యావరణాన్ని కాపాడేందుకు బీసీసీఐ చేసిన గొప్ప ఆలోచనను మెచ్చుకుంటున్నారు.

చదవండి: ఐపీఎల్‌ 2023లో ఫ్లాప్‌ అయిన టాప్‌-5 విదేశీ ఆటగాళ్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top