Who Is Velocity Kiran Navgire: 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో విధ్వంసం.. ఎవరీ కిరణ్‌ నవ్‌గిరే..?

Who is Kiran Navgire? - Sakshi

మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీలో గురువారం ట్రయల్‌బ్లేజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ బ్యాటర్‌ కిరణ్ నవ్‌గిరే చేలరేగింది. ఈ మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే నవ్‌గిరే అర్ధసెంచరీ సాధించింది. తద్వారా మహిళల టి20 చాలెంజ్‌ టోర్నీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్దసెంచరీ సాధించిన బ్యాటర్‌గా నవ్‌గిరే నిలిచింది. అంతకు ముందు షఫాలీ వర్మ 30 బంతుల్లో అర్దసెంచరీ సాధించి ఈ రికార్డును కలిగి ఉంది.

ఇక ఈ మ్యాచ్‌లో 34 బంతులు ఎదుర్కొన్న కిరణ్‌ 69 పరుగులు సాధించింది. ఆమె ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. కాగా కిరణ్‌ ఒంటరి పోరాటం చేసినప్పటికి వెలాసిటీకి ఓటమి తప్పలేదు. అయితే మ్యాచ్‌లో ఓటమి చెందినప్పటికీ తుపాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన  కిరణ్‌పై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఎవరీ కిరణ్‌ నవ్‌గిరే 
27 ఏళ్ల కిరణ్‌ నవ్‌గిరే మహారాష్ట్రలోని షోలాపూర్‌లో జన్మించింది. ఆమె తన క్రీడా జీవితాన్ని అథ్లెట్‌గా ప్రారంభించింది. జావెలిన్ త్రో, షాట్‌పుట్,రిలే రన్నింగ్‌లో చాలా పతకాలు కిరణ్‌ సాధించింది. అయితే భారత మాజీ కెప్టెన్‌ ఎంస్‌ ధోనిని ఆదర్శంగా తీసుకుని 2016లో అథ్లెటిక్స్‌ను వదిలి నవ్‌గిరే క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ధోని ప్రశాంతత, హార్డ్‌ హిట్టింగ్‌ స్కిల్స్‌ ఆమెను ఎంతో గానే ప్రేరేపించాయి.

క్రికెట్‌ కెరీర్‌
మహారాష్ట్ర జట్టుకు ఎంపిక కాకపోవడంతో డొమాస్టిక్‌ క్రికెట్‌లో నాగాలాండ్‌ జట్టుకు కిరణ్‌ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇటీవల ముగిసిన సీనియర్ మహిళల టీ20 ట్రోఫీలో కిరణ్‌ సంచలనం సృష్టించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో ఆడిన తన తొలి మ్యాచ్‌లోను కిరణ్‌  76 బంతుల్లో 162 పరుగులు చేసింది. తద్వారా టీ20 క్రికెట్‌లో 76 బంతుల్లో 162 పరుగులు చేసింది తొలి ఇండియన్‌గా రికార్డు సృష్టించింది. ఇక టోర్నీలో నవ్‌గిరే 525 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

చదవండి: Dinesh Karthik: దినేశ్‌ కార్తిక్‌ ఏంటిది? డీకేకు మందలింపు! కీలక మ్యాచ్‌కు ముందు షాక్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top