T20 WC 2024: ఫైన‌ల్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే విజేత ఎవ‌రంటే..? | what are rules of washout in IND vs SA T20 World Cup final? | Sakshi
Sakshi News home page

T20 WC 2024: ఫైన‌ల్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే విజేత ఎవ‌రంటే..?

Jun 28 2024 5:59 PM | Updated on Jun 28 2024 6:14 PM

what are rules of washout in IND vs SA T20 World Cup final?

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో తుది స‌మ‌రానికి స‌మ‌యం అస‌న్న‌మైంది. శ‌నివారం(జూన్ 29)న బార్బడోస్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ పోరులో భార‌త్‌-ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

ఈ ఫైన‌ల్ మ్యాచ్‌  భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే ఈ తుది పోరుకు వ‌ర్షం వ‌ర్షం ముప్పు పొంచి ఉంది. శ‌నివారం మ్యాచ్ జ‌ర‌గ‌నున్న బార్బడోస్‌లో ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షం కురిసే ఛాన్స్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. అక్యూ వెద‌ర్ రిపోర్ట్ ప్ర‌కారం.. జూన్ 29న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో 78 శాతం వర్షం పడే అవకాశం ఉంది. 

స్ధానిక కాల‌మానం ప్ర‌కారం ఈ మ్యాచ్ ఉద‌యం 10:30 ప్రారంభం కానుంది. మ్యాచ్ జ‌రిగే రోజు బార్బోడ‌స్‌లో ఉద‌యం 3 గంటల నుండి వర్షం మొద‌లు కానున్న‌ట్లు అక్క‌డ వాత‌వార‌ణ శాఖ‌సైతం వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో ఇరు జ‌ట్లు అభిమానులు తెగ ఆందోళ‌న చెందుతున్నారు. వర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు అయితే ఏంటి ప‌రిస్థితి అని చ‌ర్చించుకుంటున్నారు.

రిజ‌ర్వ్ డే..
ఈ ఫైన‌ల్ మ్యాచ్‌కు ఐసీసీ రిజ‌ర్వ్ డే కేటాయించింది. శ‌నివారం (జూన్ 29) నాడు వర్షం కారణంగా పూర్తిగా మ్యాచ్‌ మొదులు కాకపోతే రిజర్వ్‌ డే అయిన  ఆదివారం మ్యాచ్‌ను నిర్వ‌హిస్తారు.

ఒకవేళ మ్యాచ్‌ ప్రారంభమై ఆగిపోతే.. శ‌నివారం ఎక్క‌డైతే మ్యాచ్ ఆగిందో అక్క‌డి నుంచే ఆటను కొన‌సాగిస్తారు. మరోవైపు శ‌నివారం టాస్‌ పడ్డాక.. వర్షం అటంకం కలిగించి మ్యాచ్‌ ప్రారంభం కాకపోతే, మళ్లీ తాజాగా రిజర్వ్‌డే ఆదివారం రోజు టాస్‌ నిర్వహిస్తారు.  

మ్యాచ్ ర‌ద్దు అయితే?
కాగా ఈ మ్యాచ్ ఫలితాన్ని ఎలాగైనా తేల్చేందుకు ఐసీసీ అద‌నంగా  190 నిమిషాలు స‌మ‌యం కేటాయించింది. ఈ ఎక్స్‌ట్రా స‌మ‌యం మ్యాచ్‌డేతో పాటు రిజర్వ్‌డేకు కూడా వ‌ర్తిస్తోంది. అయితే రిజర్వ్‌డే రోజు కూడా ఆటసాధ్య పడకపోతే.. రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు. 

ద‌క్షిణాఫ్రికా, భార‌త్ రెండు జ‌ట్లు ట్రోఫీని సంయుక్తంగా పంచుకుంటున్నాయి. కాగా డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిలో విజేత‌ను నిర్ణ‌యించాల్సి వ‌స్తే ఇరు జ‌ట్లు క‌నీసం 10 ఓవ‌ర్ల చొప్పున అయిన బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement