WI Vs SA: విండీస్‌ ఘన విజయం; కెప్టెన్‌ ఒక్కడే ఆడితే సరిపోదు

West Indies Beat South Africa By 48 Runs 2nd ODI Match - Sakshi

సౌతాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ శుభారంభం చేసింది. శనివారం జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్‌ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ నిర్ణీత 50 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేసింది. మిడిలార్డర్‌ బ్యాటర్‌ షెయ్‌ హోప్‌ (115 బంతుల్లో 128 పరుగులు, 5 ఫోర్లు, ఏడు సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా.. రోవ్‌మన్‌ పావెల్‌ 46, బ్రాండన్‌ కింగ్‌ 30, కైల్‌ మేయర్స్‌ 36 పరుగులు చేశారు.  ప్రొటీస్‌ బౌలర్లలో గెరాల్డ్‌ కొట్జే మూడు వికెట్లు పడగొట్టగా.. ఫొర్టున్‌, షంసీ చెరో రెండు వికెట్లు తీశారు. 

అనంతరం 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 41.4 ఓవర్లలో 287 పరుగులకు ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ బవుమా(118 బంతుల్లో 144 పరుగులు) తన కెరీర్‌లో ఎప్పటికి గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌ ఆడాడు. అయితే కెప్టెన్‌ ఒక్కడే ఆడితే సరిపోదు.. డికాక్‌(48 పరుగులు) మినహా బవుమాకు సహకరించేవారు కరువయ్యారు. టోని డి జార్జీ 27 పరుగులు చేశాడు.

విండీస్‌ బౌలర్లలో అకిల్‌ హొసెన్‌, అల్జారీ జోసెఫ్‌లు చెరో మూడు వికెట్లు తీయగా.. ఓడెన్‌ స్మిత్‌, యానిక్‌ కారియా, కైల్‌ మేయర్స్‌ తలా ఒక వికెట్‌ తీశారు. తొలి వన్డే వర్షార్పణం కావడంతో రెండో వన్డేలో గెలిచిన విండీస్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. ఇక చివరిదైన మూడో వన్డే మార్చి 21న(మంగళవారం) జరగనుంది. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న షెయ్‌ హోప్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు వరించింది.

చదవండి: 36 బంతుల్లో 99 పరుగులు; ఒక్క పరుగు చేసుంటే చరిత్రలో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top