IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’

Wasim Jaffer Comments on Ishan Kishan poor performances - Sakshi

న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. గతేడాది బంగ్లాదేశ్‌పై వన్డేల్లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన ఇషాన్‌కు శ్రీలంకతో పాటు న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లకు భారత జట్టులో చోటు దక్కింది. అయితే శ్రీలంకతో సిరీస్‌లో కూడా కిషన్‌ తనదైన మార్క్‌ చూపించడంలో విఫలమయ్యాడు. 

ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన కిషన్‌ కేవలం 40 పరుగులు మాత్రమే చేశాడు. అనంతరం కివీస్‌తో సిరీస్‌లో కూడా కేవలం 24 పరుగులు మాత్రమే సాధించాడు. అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ఆఖరి వన్డేలో కూడా కిషన్‌ తన ఆట తీరును మార్చుకోలేదు. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. 

ఈ నేపథ్యంలో కిషన్‌పై భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వైట్‌బాల్‌ క్రికెట్‌లో కిషన్‌ నిలకడగా రాణించాలని జాఫర్‌ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా స్పిన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడంపై కూడా కిషన్‌ దృష్టిసారించాలని అతడు సూచించాడు.

ఈఎస్పీఎన్‌ క్రిక్‌ఇన్‌ఫోతో జాఫర్‌ మాట్లాడుతూ.. "లంక, న్యూజిలాండ్‌ సిరీస్‌లో కిషన్‌ నిరాశపరిచాడు. అతడు పరిమిత ఓవర్ల క్రికెట్‌ నిలకడగా రాణించేందుకు ప్రయత్నం చేయాలి.  అదే విధంగా కిషన్‌ స్పిన్నర్లను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నాడు. కాబట్టి ఆ విభాగంలో అతడు మరింత రాటుదేలాలి. ఇక ఈ సిరీస్‌లో మిగితా ఆటగాళ్లందరూ అద్భుతంగా రాణించారు. ఈ సిరీస్‌లో భారత్‌కు చాలా సానుకూలాంశాలు" ఉన్నాయి అని పేర్కొన్నాడు.
చదవండిWT20 WC 2023: దక్షిణాఫ్రికా కెప్టెన్‌కు షాకిచ్చిన సెలక్టర్లు.. ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాలేదని?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top