Washington Sundar: కౌంటీల్లో వాషింగ్టన్‌ సుందర్‌ అదిరిపోయే అరంగేట్రం

Washington Sundar 7th Player Take Five Wickets County Cricket Debut - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ కౌంటీ క్రికెట్‌లో అదిరిపోయే అరంగేట్రం ఇచ్చాడు. లంకాషైర్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సుందర్‌ ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే ఐదు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. నార్తంప్టన్‌షైర్‌తో మ్యాచ్‌లో సుందర్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. తద్వారా కౌంటీ క్రికెట్‌లో సుందర్‌ ఒక అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. కౌంటీల్లో డెబ్యూ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన ఏడో బౌలర్‌గా సుందర్‌ రికార్డులకెక్కాడు.

ఆటలో తొలిరోజే నాలుగు వికెట్లు తీసిన సుందర్‌.. రెండోరోజు ఆటలో ఒక వికెట్‌ తీసి ఓవరాల్‌గా 22 ఓవర్లలో 76 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. సుందర్‌కు తోడుగా లూక్‌ వుడ్‌ 3, విల్‌ విలియమ్స్‌ రెండు వికెట్లు తీయడంతో నార్తంప్టన్‌షైర్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ ఆరంభించిన లంకాషైర్‌ లంచ్‌ విరామం సమయానికి రెండు వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. 

కాగా ఐపీఎల్‌-2022లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున ఆడిన సుందర్ లీగ్‌ మధ్యలో గాయపడ్డాడు. అయితే టీ20 స్పెషలిస్టుగా పేరుందిన సుందర్‌కు గాయం నుంచి కోలుకున్న తర్వాత  భారత జట్టులో చోటు దక్కలేదు. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ కౌంటీల్లో రాణించి తిరిగి భారత జట్టులోకి రావాలని సుందర్ భావిస్తున్నాడు. ఇక సుందర్‌ టీమిండియా తరపున 4 టెస్టులు, 4 వన్డేలు, 31 టి20లు ఆడాడు.

చదవండి:  తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్.. 4 వికెట్లతో..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top