Women T20 WC: రేణుకా సింగ్‌ కొత్త చరిత్ర .. టీమిండియా తొలి పేసర్‌గా

Women T20 WC: Renuka Singh Thakur First Indian Pacer Take 5-Wkts-T20 WC - Sakshi

మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ రేణుకా ఠాకూర్‌ సింగ్‌ సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన రేణుకా సింగ్‌ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసింది. టి20 వరల్డ్‌కప్‌లో తరపున ఐదు వికెట్ల హాల్‌ అందుకున్న తొలి భారత మహిళా పేసర్‌గా రికార్డులకెక్కింది.

అంతేకాదు వరల్డ్‌కప్‌లో రేణుకా కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శన అందుకుంది. నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీసింది. తన తొలి మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసుకున్న రేణుకా చివరి ఓవర్‌లో మరో రెండు వికెట్లను పడగొట్టింది. డంక్లీ, వ్యాట్‌, అలిస్‌ క్యాప్సీ, అమీ జోన్స్‌, బ్రంట్‌ల రూపంలో రేణుకా ఐదు వికెట్ల మార్క్‌ను అందుకుంది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. భారత బౌలర్‌ రేణుకా సింగ్‌ తన వరుస మూడు ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బతీసింది. ఆమె మినహా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో కోలుకున్న ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బ్రంట్‌ అర్థశతకంతో రాణించగా.. అమీ జోన్స్‌ 40 పరుగులు చేసింది. రేణుకా సింగ్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. శిఖా పాండే, దీప్తి శర్మలు చెరొక వికెట్‌ తీశారు.

చదవండి: భారత్‌, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top