IND vs SA: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..!

ఐపీఎల్-2022 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు బీసీసీఐ జూనియర్ జట్టును ఎంపిక చేసే ఆలోచనలో ఉంది. ఈ జట్టుకు శిఖర్ ధావన్ లేదా హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. మరో వైపు జూలై 1న ఇంగ్లాండ్‌తో జరిగే నిర్ణయాత్మక ఐదో టెస్టు కోసం జూన్ మధ్యలోనే భారత్ లండన్‌కి బయలుదేరనుంది.
ఈ క్రమంలో సౌతాఫ్రికాతో సిరీస్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్ధానంలో భారత మాజీ టెస్టు స్పెషలిస్ట్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఐర్లాండ్ పర్యటనకు కూడా వీవీఎస్ లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టీ20 ఢిల్లీ వేదికగా జూన్9న జరగనుంది.
చదవండి: Kane Williamson: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్
మరిన్ని వార్తలు