Indian Swimmer Maana Patel Qualifying Tokyo Olympics Under Universality Quota - Sakshi
Sakshi News home page

Tokyo Olympics: యూనివర్సాలిటీ కోటాలో ఒలింపిక్స్‌కు మానా

Jul 2 2021 11:56 AM | Updated on Jul 2 2021 3:26 PM

Universality Quota Pushed Indian swimmer Maana Patel Gets Tokyo Olympics Berth - Sakshi

ఒలింపిక్స్ పోటీలకు మహిళా స్విమ్మర్ మానా పటేల్ ఎంపికైంది. యూనివర్సాలిటీ కోటాలో ఆమె టోక్యో ఒలింపిక్స్‌కు ఎన్నికైనట్లు స్విమ్మింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఎఫ్‌ఐ) శుక్రవారం ధృవీకరించింది. దీంతో భారతదేశం నుంచి ఒలింపిక్స్ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొననున్న మొట్టమొదటి మహిళా స్విమ్మర్ గా మానా పటేల్ నిలిచింది.

అహ్మదాబాద్‌కు చెందిన ఈ బ్యాక్‌స్ట్రోక్ స్విమ్మర్‌..  శ్రీహరి నటరాజ్, సజన్ ప్రకాష్‌లతో కలిసి మానా పటేల్ ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. యూనివర్సాలిటీ కోటా ద్వారా పోటీల్లో సత్తా చాటే ఓ మేల్‌, ఓ ఫిమేల్‌ అథ్లెట్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. కాగా, ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మానా పటేల్ ను కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు అభినందించారు. 

21 ఏళ్ల వయసు గల మానా పటేల్ జాతీయ క్రీడల్లో 50 బ్యాక్ స్ట్రోక్, 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో బంగారు పతకాలు సాధించింది. మానా పటేల్ 60వ నేషనల్ గేమ్స్ లో 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీలో స్వర్ణం సాధించి జాతీయ రికార్డును బద్దలు కొట్టారు. పటేల్ 72 వ సీనియర్ నేషనల్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో మూడు బంగారు పతకాలు సాధించారు. 2018 లో తిరువనంతపురంలో జరిగిన సీనియర్ నేషనల్స్‌లో పటేల్ మూడు బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్లను కైవసం చేసుకున్నారు. 2019లో గాయం తర్వాత ఈ ఏడాదే ఆమె తిరిగి పూల్‌లో దిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement