BAN vs PAK: అడ్డంగా బుక్కైన హసన్‌ అలీ.. అంపైర్‌ వార్నింగ్‌ 

Umpire Warns Hasan Ali Using Saliva To Shine The Ball BAN vs PAK Test - Sakshi

Umpire Warns Hasan Ali Use Saliva To Shine Ball.. పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ అలీని అంపైర్‌ వార్నింగ్‌ ఇచ్చాడు. కరోనా దృష్యా  ఐసీసీ నిబంధనల ప్రకారం బౌలర్లు బంతి పదును కోసం సలైవాను రుద్దడం నిషేధం. మార్చి 2020లో ఐసీసీ తీసుకొచ్చిన ఈ నిబంధనను బౌలర్లు తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. అయితే హసన్‌ అలీ బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో నిబంధనను అతిక్రమించి బంతి పదును కోసం సలైవా రుద్ది కెమెరాల్లో అడ్డంగా బుక్కయ్యాడు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి. 

చదవండి: Ban Vs Pak 1st Test: 5 వికెట్లతో మెరిసిన హసన్‌ అలీ.. సెంచరీ దిశగా అబిద్‌ అలీ

ఇది చూసిన ఫీల్డ్‌ అంపైర్‌.. హసన్‌ అలీ దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఇలా చేయడం మంచిది కాదని.. ఇంకోసారి రిపీట్‌ కావొద్దంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌ 8వ ఓవర్లో ఇది చోటుచేసుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్‌ బౌలింగ్‌ కోచ్‌ వెర్నన్‌ ఫిలాండర్‌ కూడా హసన్‌ అలీతో మాట్లాడడం వైరల్‌గా మారింది. కోచ్‌ చెబితేనే ఇలా చేశాడా.. లేక ఉద్దేశపూర్వకంగానే హసన్‌ అలీ బంతికి సలైవా రుద్దాడా అనేది తెలియదు. ఇక ఐసీసీ రూల్స్‌ ప్రకారం ఒక బౌలర్‌ బంతి పదును కోసం సలైవాను రెండుసార్ల కంటే ఎక్కువ ఉపయోగిస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. కాగా హసన్‌ అలీ ఇప్పటికే రెండుసార్లు బంతికి సలైవా రుద్దాడు. ఇంకోసారి అదే తప్పు చేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు అదనంగా ఇస్తారు. 

చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ చెత్త రికార్డు.. 21 ఏళ్ల తర్వాత

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే బంగ్లాదేశ్‌ ప్రస్తుతం 83 పరుగుల ఆధిక్యంలో ఉంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. అంతకముందు పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్‌ అయింది. పాక్‌ ఓపెనర్‌ హబీద్‌ అలీ (133 పరుగులు) సెంచరీతో మెరవగా.. షఫీఖ్‌ 52 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో తైజుల్‌ ఇస్లామ్‌ 7 వికెట్లతో దుమ్మురేపాడు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 330 పరుగులుకు ఆలౌటైంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top