మే నెలలో కొత్త ఐపీఎల్ జట్ల వేలం | Two New IPL Teams To Be Auctioned In May | Sakshi
Sakshi News home page

మే నెలలో కొత్త ఐపీఎల్ జట్ల వేలం

Mar 14 2021 5:13 PM | Updated on Apr 2 2021 8:45 PM

Two New IPL Teams To Be Auctioned In May - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 నుంచి పది జట్లు బరిలోకి దిగడం ఖరారైంది. అదనంగా రాబోయే రెండు కొత్త జట్ల కోసం వచ్చే మే నెలలో బీసీసీఐ వేలం నిర్వహించనుంది. శనివారం జరిగిన ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బిడ్డింగ్‌ ప్రక్రియ తర్వాత కొత్త ఫ్రాంచైజీలు మే చివరి వరకు ఖరారైతే... ఆయా జట్లు తమ సన్నాహాలు చేసుకునేందుకు ఏడాది పాటు సమయం ఉంటుందని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు.

ఈ సీజన్‌లో 8 జట్లతోనే ఐపీఎల్‌ జరుగనుంది. తొలుత ఈ సీజన్‌కే పది జట్లు వస్తాయని భావించినా, అది కుదరలేదు. మెగా ఐపీఎల్‌ వేలం నిర్వహించడానికి సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో 10 జట్ల నిర్ణయాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. ఈ క్రమంలోనే  మే నెలలో కొత్త జట్ల వేలానికి రంగం సిద్ధం చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement