Asia Cup 2022: బంగ్లాను వెంటాడుతున్న గాయాలు.. ఇద్దరు కీలక ఆటగాళ్లు దూరం

ఆసియాకప్ 2022 ప్రారంభానికి ముందే బంగ్లాదేశ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే బంగ్లా స్టార్ బ్యాట్స్‌మన్ లిట్టన్ దాస్ కండరాల గాయంతో నెలరోజుల కిందటే జట్టుకు దూరమయ్యాడు. తాజాగా బంగ్లా జట్టుకు మరో షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్న హసన్ మహ్ముద్, వికెట్ కీపర్ నురుల్ హసన్‌లు గాయాలతో దూరమయ్యారు. గతవారం ట్రెయినింగ్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో హసన్ చీలమండకు గాయమైంది. ఎక్స్‌రే తీయగా గాయం తీవ్రత పెద్దదని తేలడంతో నెలరోజుల విశ్రాంతి అవసరమైంది.
ఇక మరో ఆటగాడు నురుల్ హసన్ ఇటీవలే చేతి వేలికి గాయం అవడంతో సర్జరీ జరిగింది. అతను కోలుకోవడానికి రెండు వారాలు పట్టే అవకాశం ఉంది. దీంతో ఈ ఇద్దరు ఆసియాకప్ టోర్నీకి దూరమవ్వాల్సి వచ్చింది.ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ ఆసియా కప్‌లో జట్టును నడిపించనున్న సంగతి తెలిసిందే. షకీబ్ నేతృతంలోని 17 మందితో కూడిన బంగ్లాదేశ్ జట్టు మంగళవారం యూఏఈలో అడుగుపెట్టింది. రానున్న టి20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని షకీబ్‌కు జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీబీ(బంగ్లా క్రికెట్ బోర్డు) ప్రకటించింది.
చదవండి: Asia Cup 2022: తాత్కాలిక హెడ్‌కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!
Sikandar Raza: పాక్ మూలాలున్న బ్యాటర్.. అయినా సరే మనసు దోచుకున్నాడు
మరిన్ని వార్తలు