ప్రపంచ మహిళల బాక్సింగ్‌ పోటీలకు భారత జట్టు | Sakshi
Sakshi News home page

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ పోటీలకు భారత జట్టు

Published Tue, Feb 28 2023 7:12 AM

Twelve-Member Team Named For World Womens Boxing Championship - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే నెల 15 నుంచి 26 వరకు స్వదేశంలో జరిగే ప్రపంచ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. న్యూఢిల్లీ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్‌లో 12 వెయిట్‌ కేటగిరీల్లో భారత బాక్సర్లు పోటీపడతారు. గత ఏడాది టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 50 కేజీల విభాగంలో తాను సాధించిన స్వర్ణ పతకాన్ని న్యూఢిల్లీలోనూ నిలబెట్టుకునేందుకు తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ బరిలోకి దిగనుంది.  

భారత జట్టు: నీతూ ఘంఘాస్‌ (48 కేజీలు), నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు), సాక్షి చౌదరీ (52 కేజీలు), ప్రీతి (54 కేజీలు), మనీషా మౌన్‌ (57 కేజీలు), జాస్మిన్‌ లంబోరియా (60 కేజీలు), శశి చోప్రా (63 కేజీలు), మంజు బంబోరియా (66 కేజీలు), సనమచ చాను (70 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్‌ (75 కేజీలు), సవీటి బూరా (81 కేజీలు), నుపర్‌ షెరాన్‌ (ప్లస్‌ 81 కేజీలు).    

Advertisement
 
Advertisement
 
Advertisement