Lovlina Borgohain: బాక్సర్‌ లవ్లీనాకు బంపరాఫర్‌.. డీఎస్పీగా ఉద్యోగం, జీతంతోపాటు అదనంగా నెలకు లక్ష రూపాయలు

Tokyo Olympics Silver Medalist Lovlina Borgohain Appointed As DSP - Sakshi

Lovlina Borgohain: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ డీఎస్పీగా నియమితులయ్యారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆమెకు నియామక పత్రాలు అందించారు. గతేడాది టోక్యోలో జరిగిన ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్‌ 69 కేజీల విభాగంలో లవ్లీనా భారత్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన ఆమె సెమీస్‌ చేరారు. 

అయితే వరల్డ్‌ నంబర్‌ వన్‌ టర్కీకి చెందిన బుసెనజ్‌తో జరిగిన సెమీస్‌లో ఓడిపోవడంతో ఆమె కాంస్య పతకం సాధించింది. ఈ సందర్భంగా అసోం సీఎం హిమంత ఆమెకు డీఎస్పీ ఉద్యోగంతోపాటు కోటి రూపాయల పారితోషికం ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు బుధవారం ఉదయం లవ్లీనాకు డీఎస్పీ నియామక పత్రం అందజేశారు.

నెలవారీ జీతంతోపాటు లవ్లీనాకు బాక్సింగ్‌ ట్రైయినింగ్‌ ఖర్చుల కోసం అదనంగా రూ.లక్ష ఇవ్వనున్నట్టు సీఎం తెలిపారు. దాంతోపాటు పంజాబ్‌లోని పటియాలలో కోచింగ్‌ తీసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే అంతర్జాతీయ స్థాయి కోచ్‌తో గువాహటిలోనే ట్రయినింగ్‌ ఇప్పిస్తామని చెప్పారు. ఈసందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పోలిస్‌ శాఖకు కృతజ్ఞతలు చెప్పిన లవ్లీనా.. తన లక్ష్యం వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమేనని అన్నారు.
(చదవండి: హాకీ జట్టు కెప్టెన్‌గా సవితా పునియా.. గోల్‌కీపర్‌గా మన అమ్మాయి రజని)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top