జెర్సీని వేలం వేయనున్న టిమ్‌ సౌథీ.. కారణం ఏంటంటే

Tim Southee Auctions Signed Jersey To Help 8 Year Old Girl Cancer Fight - Sakshi

ఆక్లాండ్‌: న్యూజిలాండ్‌ క్రికెటర్‌ టిమ్‌ సౌథీ ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వేసుకున్న జెర్సీని వేలం వేయనున్నాడు. క్యాన్సర్‌తో పోరాడుతున్న 8 ఏళ్ల బాలికను రక్షించడానికి సౌథీ ఈ పని చేయనున్నాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడిన 11 మంది ఆటగాళ్లతో ఇప్పటికే జెర్సీపై సంతకాలు చేయించగా.. తాజాగా ఆ జెర్సీని వేలం వేయనున్నట్లు ప్రకటించాడు. వేలం ద్వారా వచ్చే డబ్బును చిన్నారి చికిత్సకు ఉపయోగించనున్నట్లు తెలిపాడు.


ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో షేర్‌ చేసుకున్న సౌథీ స్పందిస్తూ..' హోలీ బీటీ అనే 8 ఏళ్ల బాలిక మూడేళ్లుగా న్యూరోబ్లస్టోమా క్యాన్సర్‌తో పోరాడుతుంది. రెండున్నరేళ్లుగా చికిత్స తీసుకుంటున్న బెట్టీ రెండున్నర సంవత్సరాలుగా చికిత్స తీసుకుంటుంది. కాగా ఇటీవలే ఆమె మెదుడులో మూడు సెంటీమీటర్ల ట్యూమర్‌ని గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని నాకు మా కుటంబసభ్యులు తెలిపారు. నా కుటుంబసభ్యులు కూడా చిన్నారి చికిత్సకు అవసరమైన మందులు, పరికరాలు సమకూర్చారు. ఇక ఆ చిన్నారిని బతికించేందుకు నేను డబ్ల్యూటీసీ ఫైనల్లో వేసుకున్న జెర్సీని వేలం వేయాలని నిర్ణయించుకున్నా. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బెట్టీ కుటుంబానికి అందజేస్తాను. నా జెర్సీని దక్కించుకోవాలనే వాళ్లు బిడ్‌ వేయండి అంటూ చెప్పుకొచ్చాడు. సౌథీ జెర్సీ వేలంపై అభిమానుల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. ఇక డబ్ల్యూటీసీ టోర్నీలో భాగంగా 2019-21 కాలంలో 11 టెస్టులు ఆడిన సౌథీ 56 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక భారత్‌తో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో సౌథీ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసి కివీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

చదవండి: ఊహించని విధంగా బౌన్సర్‌ వేశాడు.. దాంతో

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top