హ్యాపీ బర్త్‌డే వచ్చాక చెప్తాను: సానియా

Tennis Star Sania Mirza Birthday Wishes To Shoaib Malik - Sakshi

పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ నేడు 39 పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన సతీమణి, భారత టెన్నిస్‌ స్టార్‌ సానీయా మీర్జా వెరైటీగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పింది. "ఎవరు లేకపోతే నేను బతకలేనో అతడికి హ్యాప్‌ బర్త్‌డే. నీకు రోజులు, నెలలు, ఈ సంవత్సరమంతా బాగుండాలని కోరుకుంటున్నాను. ముఖ్య విషయమేంటంటే నువ్వు ప్రాక్టీస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత ఇదంతా చెప్తాను. ఇంతకీ ఇది బర్త్‌డే విషెసేనా?, కాదంటావా? ఇదంతా పోనీ కానీ, ఐ లవ్‌ యూ" అని రాసుకొచ్చింది. దీనికి భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేసింది. (చదవండి: కరోనా : సానియా మీర్జా భావోద్వేగం)

కాగా అభిమానుల నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ సానియా మీర్జా, షోయబ్‌ మాలిక్‌ 2010 ఏప్రిల్‌ 12న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2018లో ఇజ్జాన్‌ జన్మించాడు. ఇదిలా వుంటే ఈ మధ్యే సానియా కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె జనవరి 19న సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ తనకు స్వల్పంగా కోవిడ్‌-19 లక్షణాలున్నాయని పేర్కొంది. ఈ సమయంలో తన ఫ్యామిలీకి, ముఖ్యంగా తన రెండేళ్ల చిన్నారికి దూరంగా ఉండటం భయంకరంగా అనిపించిందని చెప్పుకొచ్చింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కరోనాను అసలు జోక్‌గా తీసుకోవద్దని సూచిస్తూ సుదీర్ఘ పోస్ట్‌ను షేర్‌ చేసింది. (చదవండి: భారత జూనియర్‌ మహిళల హాకీ జట్టుకు మరో గెలుపు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top