భారత జూనియర్‌ మహిళల హాకీ జట్టుకు మరో గెలుపు | Indian junior women hockey team beats Chile senior side 2-0 | Sakshi
Sakshi News home page

భారత జూనియర్‌ మహిళల హాకీ జట్టుకు మరో గెలుపు

Jan 25 2021 4:35 AM | Updated on Jan 25 2021 4:35 AM

Indian junior women hockey team beats Chile senior side 2-0 - Sakshi

చిలీ సీనియర్‌ మహిళల జట్టుపై భారత జూనియర్‌ మహిళల హాకీ జట్టు ఆధిపత్యం కొనసాగుతోంది. సాంటియాగోలో జరుగుతున్న ఈ సిరీస్‌లో ఓటమి ఎరుగని భారత జూనియర్లు ఆదివారం జరిగిన ఐదో మ్యాచ్‌లో 2–0 గోల్స్‌ తేడాతో చిలీ సీనియర్‌ జట్టుపై విజయం సాధించారు. తొలి 3 క్వార్టర్లలో హోరాహోరీ పోరాటం సాగగా... చివరిదైన నాలుగో క్వార్టర్‌లో భారత్‌ నేర్పుగా గోల్స్‌ చేసింది. తొలుత సంగీత కుమారి 48వ నిమిషంలో గోల్‌ చేసి భారత్‌కు 1–0తో ఆధిక్యాన్ని అందించింది. తర్వాత 56వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌ను సుష్మా కుమారి గోల్‌గా మలిచింది. ఈ మ్యాచ్‌లో చిలీ జట్టుకు పలుమార్లు గోల్‌ చేసే అవకాశాలు వచ్చినా భారత డిఫెన్స్‌ సమర్థంగా వాటిని నిలువరించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement