చిలీలో తీవ్ర భూకంపం | Earthquake in Chile | Sakshi
Sakshi News home page

చిలీలో తీవ్ర భూకంపం

May 26 2026 5:11 AM | Updated on May 26 2026 5:22 AM

Earthquake in Chile

శాంటియాగో: నిన్న మధ్యాహ్నం ఉత్తర చిలీలోని అంటో ఫాగస్టా ప్రాంతంలో తీవ్ర భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. యూనివర్శిటీ ఆఫ్ చిలీకి చెందిన నేషనల్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక కాలమానం సాయంత్రం 5:52 గంటలకు  ఈ భూకంపం వచ్చిందని కలామా నగరానికి దక్షిణంగా 12 కిలోమీటర్ల  దూరంలో భూమి కంపించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది.

అయితే ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ భూకంపంలో ఇప్పటి వరకూ ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగనట్లు తెలుస్తోంది. చిలీ దేశం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన భూకంప ప్రాంతమైన "పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉంది. ఈ భౌగోళిక కదలికల వల్లే చిలీలో నిరంతరం  తీవ్రమైన భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.

చిలీ ప్రాంతం ఇప్పటి వరకూ దాదాపు 100కు పైగా  భారీ భూకంపాలను ఎదుర్కొంది. ఇందులో దాదాపు 30 భూకంపాలు 8.0 కంటే ఎక్కువ తీవ్రత కలిగిన వంటే ‍పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement